Site icon NTV Telugu

Adulterated Milk Tragedy: కల్తీ పాలు ఘటన.. మరో మహిళ మృతి.. 10కి చేరిన మృతుల సంఖ్య..!

Adulterated Milk Tragedy In Rajahmundry

Adulterated Milk Tragedy In Rajahmundry

Adulterated Milk Tragedy: రాజమండ్రిలో కల్తీ పాలు ఘటన తీవ్ర విషాదానికి దారితీసింది. చౌడేశ్వరి నగర్‌కు చెందిన అనంతలక్ష్మి (72) అనే మహిళ శనివారం మృతి చెందడంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. కల్తీ పాలు సేవించిన కారణంగా అనారోగ్యం పాలైన మరో పదిమంది ప్రస్తుతం రాజమండ్రిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురు తీవ్ర స్థితిలో ఉండగా వెంటిలేటర్‌పై డయాలసిస్ చికిత్స అందిస్తున్నారు. మరో నలుగురికి డయాలసిస్ కొనసాగుతోంది.

India Playing XI vs NZ: ప్రపంచ కప్ ఫైనల్‌ జట్టులో కీలక మార్పు.. న్యూజిలాండ్ కు ఉచ్చు బిగుసుకున్నట్లే.!

అనారోగ్యం పాలైన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కల్తీ పాలు సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Ind vs NZ: న్యూజిలాండ్‌కు అసలైన మొగుడు కెప్టెన్ సూర్య.. కివీస్‌పై దుమ్మురేపిన టాప్ 5 భారత బ్యాటర్లు వీరే!

Exit mobile version