Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- ఢిల్లీలో షాకింగ్ సంఘటన..
- భార్యతో ఘర్షణ.. భర్తను కొట్టి చంపిన అత్తింటి వారు..
- మృతుడు అడోబ్ ఇంజనీర్, ఏడాదికి రూ. 60 లక్షల ప్యాకేజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident: ఢిల్లీలో జరిగిన ఒక టెక్కీ మృతి సంచలనంగా మారింది. భార్య భర్తల మధ్య జరిగిన చిన్న వివాదం, భర్త హత్యకు దారి తీసింది. 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను సొంత అత్తమామలే కొట్టి చంపాను. శనివారం జరిగిన ఈ ఘటనలో టెక్కీ వినయ్ గుప్తా మరణించారు. భార్య రేఖతో చిన్నారికి మందులు ఇచ్చే విషయంలో గొడవ జరిగింది. దీని తర్వాత రేఖ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
10 నిమిషాల తర్వాత రేఖ ఇద్దరు సోదరులు, వదిన, తండ్రి, మేనమామతో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కలిసి భర్త ఇంటికి తిరిగి వచ్చింది. దాడి సమయంలో వినయ్ తల్లిదండ్రులు కూడా ఇంటిలోనే ఉన్నారు. వియ్యంకులు వచ్చారని వినయ్ తల్లి వారికి నీరు, ఇతర ఏర్పాట్లు చేసేందుకు బయటకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి వినయ్ పై తల్లి చూస్తుండగానే దాడి జరిగింది. ఆమె అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వినయ్‌పై మూకుమ్మడిగా దాడి చేస్తూనే ఉన్నారు.
Also Read
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
అతడి మెడను పట్టుకుని, ఛాతిపై చేతులతో కొట్టి తన్నినట్లు విజయ్ కుటుంబం ఆరోపించింది. ఇది ముందుగానే కుట్రగా వారు ఆరోపించారు. ఘటనకు ముందు రేఖ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దాడి జరిగిన కొన్ని నిమిషాల తర్వాత వినయ్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. వినయ్ నోయిడాలోని అడోబ్ కంపెనీలో పనిచేస్తున్నారు. అతడికి వార్షిక ప్యాకేజ్ సుమారు రూ. 60 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది.
మూడున్నరేళ్ల క్రితం వినయ్, రేఖలకు వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగున్నర నెలల కవల పిల్లలు ఉన్నారు. ఢిల్లీలోని ఇంట్లో వినయ్, రేఖ మూడో అంతస్తులో నివసిస్తుండగా, వినయ్ తల్లిదండ్రులు కింది అంతస్తులో ఉంటున్నారు. రేఖ వేరుగా వంట చేసుకునేదని, పలు సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకు వినయ్‌ను చంపేస్తానని బెదిరించదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో రేఖ, ఆమె ఇద్దరు సోదరులు, ఒక వదిన ఉన్నారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!