Adivi Sesh-Dulquer Salmaan Multi-Starrer Movie: తెలుగులో ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు చాలా అరుదు అయినా.. ఇప్పుడు చాలానే వస్తున్నాయి. ఇందుకు కారణం విక్టరీ వెంకటేష్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మసాలా, గోపాల గోపాల, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, ఎఫ్ 2, వెంకీమామ లాంటి మల్టీస్టారర్ సినిమాలలో వెంకటేష్ నటించారు. ఆపై మల్టీస్టారర్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్, ఆచార్య, ఓరి దేవుడా లాంటి సినిమాలు వచ్చాయి. ప్రభాస్ కల్కీ 2898 ఏడీలో కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లు నటిస్తున్నారు. తాజాగా తెలుగులో మరో మల్టీస్టారర్ సినిమా రాబోతుంది.
Also Read: Kalki 2898 AD: దీపికా పదుకోన్ తెలుగులో మాట్లాడనుందా?
దుల్కర్ సల్మాన్, అడివి శేషు కాంబోలో ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు పరశురామ్ దగ్గర పనిచేసిన ఓ యువ డైరెక్టర్ ఈ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించనున్నాడట. అతడు చెప్పిన కథ నచ్చడంతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్‌బీకే 109 కూడా మల్టీస్టారరే అని చెప్పాలి. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడు.