Adhir Ranjan Chowdhury : పిట్రోడా వ్యాఖ్యలను సమర్థించిన అధీర్ రంజన్… అసలేమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి సమర్థించారు. ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లుగా ఉంటారం’టూ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను మరిచిపోకముందే.. రంజన్ చౌదరి ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. దేశంలో నీగ్రోలు ఉన్నారంటూ ఆయన పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా పిట్రోడా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నట్టు మాట్లాడారు. దీంతో కాంగ్రెస్ నాయకుల వైఖరిని సోషల్‌మీడియాలో పలువురు తప్పుబడుతున్నారు. కాగా లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేతల వ్యవహారశైలి, వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి కొత్త ఇబ్బందులు తీసుకొస్తున్నాయి.
READ MORE: CM YS Jagan: నేటి సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే..
Also Read
- జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
అధిర్ రంజన్ ఏమన్నారంటే..పిట్రోడా జాతి వివక్ష వ్యాఖ్యలపై మీరేమంటారని జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ అధిర్ రంజన్‌ను అడిగింది. ఆయన స్పందిస్తూ.. ‘వ్యక్తిగత అభిప్రాయాల గురించి నేను మాట్లాడట్లేదు. అయితే, మన దేశంలో నెగ్రిటో క్లాస్ (నీగ్రోలు-ఆగ్నేయాసియాలోని నల్ల జాతీయుల తెగ), ప్రోటో ఆస్ట్రేలియన్, మంగోలియన్ తరగతి ప్రజలు ఉన్నారు. విశాలమైన భూభాగం కలిగిన మన దేశంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. దేశ ప్రజలందరూ ఒకే విధంగా ఉండరు కదా? కొందరు నల్లగా, మరికొందరు తెల్లగా ఉంటారు’ అని పేర్కొంటూ పరోక్షంగా పిట్రోడా వ్యాఖ్యలను సమర్థించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు దేశంలో దుమారం రేపుతున్నాయి. పిట్రోడా మాత్ర మే కాదు.. కాంగ్రెస్ నేతలంతా.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ మండిపడింది. అధిర్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ జాతీయ ప్రతినిధి షేహ్‌జాద్ పూనావాలా వారి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. కాగా.. దేశంలో ‘వారసత్వ పన్ను’ ఉండాలంటూ ఇటీవల దుమారంరేపిన కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా.. భారత్‌ను వైవిధ్య దేశంగా అభివర్ణించే క్రమంలో దక్షిణాది ప్రజలను ఆఫ్రికన్లతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!