Samantha Ruth Prabhu: ఇకపై మరింత ఎక్కువగా కష్టపడుతా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha on IMDb 13th Spot: ఐఎండీబీ జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తన కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది అని స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు తెలిపారు. కెరీర్‌ను ఇప్పుడే మొదలుపెట్టినట్లు అనిపిస్తుందని, అప్పుడే ఇన్నేళ్లు ఎలా గడిచాయో తనకు అర్థం కావట్లేదన్నారు. తనకు గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, ఇకపై మరింత ఎక్కువ కష్టపడి పనిచేస్తానని సామ్ చెప్పారు. ఇటీవల ఐఎండీబీ విడుదల చేసిన ‘టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్’ జాబితాలో 13వ స్థానాన్ని సమంత సొంతం చేసుకున్నారు. దీనిపై తాజాగా సామ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.
‘ఐఎండీబీ జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉంది. నా కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది. కెరీర్‌ను ఇప్పుడే మొదలుపెట్టినట్లు అనిపిస్తోంది. అప్పుడే ఇన్నేళ్లు ఎలా గడిచాయో అర్థం కావట్లేదు. గొప్ప సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇకపై మరింత ఎక్కువ కష్టపడి పనిచేస్తా’ అని సమంత చెప్పారు. ఐఎండీబీ జాబితాలో టాప్ 15లో ఉన్న ఏకైక సౌత్ స్టార్‌గా సామ్ ఉన్నారు. ఈ జాబితాలో దీపికా పడుకోణె అగ్రస్థానంలో నిలిచారు. షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో ఉండగా.. ఐశ్వర్య రాయ్ మూడో స్థానంలో ఉన్నారు. అలియా భట్, ఇర్ఫాన్ ఖాన్, అమీర్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ టాప్ 10లో ఉన్నారు. తమన్నా భాటియా, నయనతార వరుసగా 16, 18వ స్థానాల్లో నిలిచారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
Also Read: Kajal Aggarwal: యాప్ డౌన్లోడ్ చేసుకోండి.. కాజల్ అగర్వాల్‌తో ఛాన్స్ కొట్టేయండి!
‘మంచి పోటీ కారణంగా ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఏ రంగంలో అయినా ఒకరితో మరొకరు పోల్చుకోవడం సహజం. నేను పక్కవారిని చూసి స్ఫూర్తి పొందుతాను. వారి విజయాలను చూసి ఈర్ష పడను, ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలనుకుంటాను. నేనెప్పుడూ పోటీని నెగెటివ్‌గా చూడను’ అని సమంత తెలిపారు. సామ్ ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’లో నటిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’పై రూపొందుతున్న తొలి చిత్రం ఇదే. వెబ్‌సిరీస్ ‘సిటడెల్: హనీ- బన్నీ’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుగా రానున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!