Prabhas: బాహుబలి తర్వాత సరైన హిట్ లేదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు…. అయినా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆదిపురుష్, సలార్, ప్రాజెక్టు కే లాంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు.. అవి కాగానే మారుతీ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా చేయనుందట. ఆమె ఎవరో కాదు రాజ్ తరుణ్ సరసన నటించిన రిద్ధి కుమార్. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో ఈ ఈమె నటించింది. రైలు ప్రమాదంలో చేయి కోల్పోయిన వ్యక్తిగా ఆమె అలరించింది.
Read Also: Bird Flu: అమెరికాలో ఏవియన్ ఫ్లూ విలయం… ఐదు కోట్ల కోళ్లు బలి
తాజాగా ప్రభాస్- మారుతీ కాంబోలో రానున్న ఈ చిత్రంలో కనిపించనుందిట. ఈ సినిమా గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఇందులో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. తాత, మనవడు ఇద్దరి పాత్రల్లోనూ ప్రభాస్ కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు ప్రచారంలో ఉంది. పాత థియేటర్‌లో దాచిన నిధిన వెలికితీసే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఇంతవరకూ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అంతేకాకుండా ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టనున్నారట నిర్మాతలు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ షూటింగ్‌ల బిజీగా ఉన్నారు. ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశకు వచ్చేసింది. మరోవైపు ఆదిపురుష్ చిత్రంలోనూ విఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలతో పాటు అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే కంప్లీట్ చేయనున్నారు.