Kangana Ranaut: కంగనా రనౌత్ ఇంట్లో తీవ్ర విషాధం..
- కంగనా రనౌత్ అమ్మమ్మ మృతి
- ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలిపిన కంగనా
- ఆమెతో మధుర క్షణాలను పంచుకున్న నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటి నుంచి ఓ విషాధ వార్త బయటకు వచ్చింది. ఆమె అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని కంగనా తెలియజేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన అమ్మమ్మతో కలిసి ఉన్న కొన్ని చిత్రాలను పంచుకున్నారు. నవంబర్ 8వ తేదీ శుక్రవారం రాత్రి కంగనా రనౌత్ అమ్మమ్మ మరణించినట్లు అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె శనివారం తన అభిమానులకు తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం తన అమ్మమ్మకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని రాసుకొచ్చారు.
READ MORE: Trump Effect: ట్రంప్ ఎఫెక్ట్ స్టార్ట్.. ఖతార్ నుంచి హమాస్ బహిష్కరణ..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మొదటి కథనంలో ఆమె తన అమ్మమ్మతో కలిసి బిగ్గరగా నవ్వుతూ కనిపించారు. “నిన్న రాత్రి మా అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ జీ మరణించారు. కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. దయచేసి వారి కోసం ప్రార్థించండి. ” అని ఆమె రాసుకొచ్చారు.
READ MORE:Kishan Reddy: సీఎం చేయాల్సింది మూసీ యాత్ర కాదు.. కల్లాల్లో పర్యటించాలి
కంగనా రనౌత్ తన అమ్మమ్మతో మరొక చిత్రాన్ని పంచుకున్నారు. “అమ్మమ్మ అద్భుతమైన మహిళ. ఆమెకు 5 మంది పిల్లలు ఉన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. ఆమె తన పిల్లలందరికీ మంచి విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అందేలా చూశారు. పెళ్లయిన తర్వాత తన కుమార్తెలు పని చేయాలని వారి స్వంత వృత్తిని కలిగి ఉండాలని ఆమె సూచించారు. కుమార్తెలకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఇది ఆ రోజుల్లో అరుదైన విజయం. ఆడవారితో సహా ఆమె 5 మంది పిల్లలకు ఇప్పుడు మంచిగా స్థిరపడ్డారు. ఆమె తన పిల్లల కెరీర్‌ల గురించి చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. ” అని నటి పేర్కొన్నారు. తన అమ్మమ్మ వయస్సు 100 ఏళ్లు దాటిందని బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?