Site icon NTV Telugu

Actor Rajasekhar: నటుడు ఎప్పుడూ నటుడే.. సెకండ్ ఇన్నింగ్స్‌పై రాజశేఖర్ క్లారిటీ!

Rajasekhar

Rajasekhar

Actor Rajasekhar: యాంగ్రీ యంగ్ మ్యాన్ డా.రాజశేఖర్ అంటే గుర్తొచ్చేది ఆయన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు. చాలా కాలం విరామం తర్వాత రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఇటీవల ఎన్టీవీకి ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో ఆయన పాల్గొని, తన కెరీర్ కంబ్యాక్ గురించి, ఈ వయసులో కూడా అంత ఫిట్‌గా ఉండటానికి గల కారణాలను వివరించారు.

READ ALSO: Nara Lokesh: చిన్నారుల కోసం కఠిన నిబంధనలు.. సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు.!

60 ఏళ్లు దాటినా ఇప్పటికీ యంగ్‌గా కనిపించడం వెనుక ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఉందని చెప్పారు. తన గ్లామర్ రహస్యం గురించి ఆయన మాట్లాడుతూ.. తాను నిత్యం తీసుకునే డైట్‌లో పండ్ల రసాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. ముఖ్యంగా పుచ్చకాయ, ఆపిల్, ఆరెంజ్ కలిపిన మిశ్రమ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటానని చెప్పారు. కేవలం డైట్ మాత్రమే కాకుండా, క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల తన బాడీని ఎనర్జిటిక్‌గా ఉంచుకోగలుగుతున్నానని తెలిపారు. ఒకప్పుడు కేవలం హీరోగానే కనిపించిన రాజశేఖర్, ఇప్పుడు కథా బలాన్ని బట్టి సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.

“నటుడు ఎప్పుడూ నటుడే.. మంచి పాత్ర దొరికితే తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు” అని ఆయన తన కంబ్యాక్ పట్ల ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల తను నటించిన బైకర్ సినిమాలో రోల్‌కు లభిస్తున్న ఆదరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన పాత్రలను ప్రేక్షకులు ఓన్‌ చేసుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కంబ్యాక్‌లో తన భార్య జీవిత పాత్ర ఎంతో కీలకం అని వెల్లడించారు. జీవిత గురించి మాట్లాడుతూ.. ఆమె చాలా అవగాహన ఉన్న వ్యక్తి అని, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్లే కెరీర్‌లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడగలిగామని చెప్పారు. మొత్తానికి రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత జోష్‌తో దూసుకుపోవడానికి సిద్ధమయ్యారు. కెరీర్ పట్ల ఆయనకున్న అంకితభావం చూస్తుంటే, మున్ముందు ఆయన నుంచి మరిన్ని పవర్‌ఫుల్ పాత్రలను మనం ఆశించవచ్చు.

READ ALSO: CD Gopinath: భారత క్రికెట్‌‌లో ముగిసిన ఒక స్వర్ణయుగం.. తొలి టెస్ట్ విజేత ‘చివరి యోధుడు’ కన్నుమూత!

Exit mobile version