Actor Rajasekhar: నటుడు ఎప్పుడూ నటుడే.. సెకండ్ ఇన్నింగ్స్‌పై రాజశేఖర్ క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Rajasekhar: యాంగ్రీ యంగ్ మ్యాన్ డా.రాజశేఖర్ అంటే గుర్తొచ్చేది ఆయన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు. చాలా కాలం విరామం తర్వాత రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఇటీవల ఎన్టీవీకి ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో ఆయన పాల్గొని, తన కెరీర్ కంబ్యాక్ గురించి, ఈ వయసులో కూడా అంత ఫిట్‌గా ఉండటానికి గల కారణాలను వివరించారు.
READ ALSO: Nara Lokesh: చిన్నారుల కోసం కఠిన నిబంధనలు.. సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు.!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
60 ఏళ్లు దాటినా ఇప్పటికీ యంగ్‌గా కనిపించడం వెనుక ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఉందని చెప్పారు. తన గ్లామర్ రహస్యం గురించి ఆయన మాట్లాడుతూ.. తాను నిత్యం తీసుకునే డైట్‌లో పండ్ల రసాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. ముఖ్యంగా పుచ్చకాయ, ఆపిల్, ఆరెంజ్ కలిపిన మిశ్రమ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటానని చెప్పారు. కేవలం డైట్ మాత్రమే కాకుండా, క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల తన బాడీని ఎనర్జిటిక్‌గా ఉంచుకోగలుగుతున్నానని తెలిపారు. ఒకప్పుడు కేవలం హీరోగానే కనిపించిన రాజశేఖర్, ఇప్పుడు కథా బలాన్ని బట్టి సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.
“నటుడు ఎప్పుడూ నటుడే.. మంచి పాత్ర దొరికితే తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు” అని ఆయన తన కంబ్యాక్ పట్ల ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల తను నటించిన బైకర్ సినిమాలో రోల్‌కు లభిస్తున్న ఆదరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన పాత్రలను ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కంబ్యాక్‌లో తన భార్య జీవిత పాత్ర ఎంతో కీలకం అని వెల్లడించారు. జీవిత గురించి మాట్లాడుతూ.. ఆమె చాలా అవగాహన ఉన్న వ్యక్తి అని, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్లే కెరీర్‌లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడగలిగామని చెప్పారు. మొత్తానికి రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత జోష్‌తో దూసుకుపోవడానికి సిద్ధమయ్యారు. కెరీర్ పట్ల ఆయనకున్న అంకితభావం చూస్తుంటే, మున్ముందు ఆయన నుంచి మరిన్ని పవర్‌ఫుల్ పాత్రలను మనం ఆశించవచ్చు.
READ ALSO: CD Gopinath: భారత క్రికెట్‌లో ముగిసిన ఒక స్వర్ణయుగం.. తొలి టెస్ట్ విజేత ‘చివరి యోధుడు’ కన్నుమూత!
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!