Nara Lokesh: చిన్నారుల కోసం కఠిన నిబంధనలు.. సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు.!
- చిన్నారులకు సోషల్ మీడియా దుష్ప్రభావాలు..
- దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు కీలక చర్యలు
- ఉండవల్లిలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహణ
- నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, సోషల్ మీడియా ప్రతినిధులు హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్నపిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు కీలక చర్యలు ప్రారంభించింది. ఉండవల్లి నివాసంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించి, ఈ అంశంపై విధివిధానాల రూపకల్పనతో పాటు చట్టం తయారీపై చర్చించారు. ఈ సమావేశంలో నారా లోకేష్ తో పాటు మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ప్రతినిధులు, అధికారులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కీలక విషయాలను చర్చించారు. 13 సంవత్సరాల లోపు పిల్లలను సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరంగా ఉంచే విధంగా విధివిధానాలు రూపొందించి, ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే 13 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు వయస్సుకు అనుగుణమైన కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
Juvvaladinne Boats Missing Mystery issue: ఆ బోట్లు ఎక్కడ..? ఎవరి పాత్ర ఏంటి..?
సోషల్ మీడియాలో మహిళలపై అవమానకరమైన, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. పిల్లల డిజిటల్ భద్రత, శ్రేయస్సు కోసం అవసరమైన లీగల్ మెకానిజంను రూపొందించేందుకు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ప్రత్యేకంగా ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్ వంటి దేశాల్లో అమలులో ఉన్న విధానాలను పరిశీలించాలని, పిల్లలను సెన్సిటివ్ కంటెంట్ నుంచి దూరంగా ఉంచే మార్గాలను గుర్తించాలని ఆదేశించారు. అలాగే సోషల్ మీడియా ప్రభావంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ రోజున విద్యార్థులకు, ప్రతి ఏడాది నిర్వహించే మెగా పీటీఏ సమావేశాల్లో తల్లిదండ్రులకు సోషల్ మీడియా దుష్ప్రభావాలపై అవగాహన కల్పించనున్నారు. అదేవిధంగా మహిళల భద్రతపై స్వయంసహాయ సంఘాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. వయస్సు నిర్ధారణ కోసం డిజిలాకర్ ఆధారిత ‘ఏజ్ టోకెన్’ విధానాన్ని కూడా పరిశీలించనున్నారు. ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత కేంద్ర చట్ట పరిధిలో వచ్చే అంశాలపై నివేదికను సమర్పించనున్నారు.
TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!
ఈ సమావేశంలో సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు కూడా తమ విధానాలను వివరించారు. చిన్నపిల్లలను సున్నితమైన కంటెంట్ నుంచి దూరంగా ఉంచేందుకు తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చొరవకు పూర్తి సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. అంతేకాక, ఐటీ చట్టంలోని సెక్షన్ 46 కింద న్యాయ నిర్ణయాధికారిని వెంటనే నియమించే చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!