NTV Telugu Site icon

Prudhviraj on AP Politics: ఏపీలో రాజకీయాలపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prudhviraj

Prudhviraj

Prudhviraj on AP Politics: ఏపీలో రాజకీయాలపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహావిష్కరణకు విచ్చేసిన సినీ నటుడు పృథ్వీరాజ్ ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని పృథ్వీరాజ్ జోస్యం చెప్పారు. రానున్న 100 రోజుల తర్వాత రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందనుందన్నారు. యువగళం ముగింపు సభ… కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార సభలా ఉందని ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట ప్రజలకు చేరువైందన్నారు. వైసీపీ నాయకుల నోర్లు ఫినాయిల్‌తో కడిగినా మారవు.. మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకుంటారన్నారు. నిజంగా 175 కు 175 సీట్లు వైసీపీకి వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు ఎందుకోసం అంటూ ఆయన ప్రశ్నించారు. జనసేన, టీడీపీ పాలనతోనే రాష్ట్ర ప్రజలకు శాంతి, సంక్షేమం, అభివృద్ధి ఫలాలు లభిస్తాయన్నారు.

Read Also: GVL Narasimha Rao: పొత్తులపై జీవీఎల్‌ కామెంట్స్‌.. లేటైనా లేటెస్ట్ గా..!

సినీ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. “వచ్చే ఎన్నికలతో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. బలిజల ఐక్యత ఎలా ఉంటుందో రానున్న ఎన్నికల ఫలితాల్లో తెలుస్తుంది అధికార పార్టీ నాయకులు ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన కవ్వింపులకు దిగినా ఆవేశాలకులోను కావద్దు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా నేను పోటీకి సిద్ధంగానే ఉన్నా. అనకాపల్లి నుంచి పోటీ చేసేందుకు కూడా నేను రెడీ. అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికి వస్తాడు. రోజాకు అహంకారం ఎక్కువ. అందుకే ఆమెపై ఎవరైనా విమర్శలు చేసినా…సొంత పార్టీలో మహిళా మంత్రులుగాని, ప్రజా ప్రతినిధులు ఎవరు రోజాకు మద్దతు తెలపలేదు. ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం… అధికార పార్టీ నుంచి జంపింగ్ జపాంగ్‌లు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. వందల ఎకరాలు ఉన్న వారికి కూడా రైతుబంధు ఇవ్వడం బీఆర్ఎస్‌కు నష్టం కలిగించింది. ఫెవికాల్ వేసుకుని సీఎం కుర్చీకి నేనే అతుక్కుని ఉంటా… నేనే దోచుకోవాలి. రాష్ట్రంలో మరో నాయకుడు ఎదగకూడదు… అనుకుంటే ఎవరైనా భూస్థాపితం కావాల్సిందే.” అని పృథ్వీరాజ్‌ అన్నారు.