షర్మిల ఇప్పడు జగనన్న వదిలిన బాణం కాదు.. అవన్నీ పాత రోజులని సినీనటుడు, జనసేన నేత పృధ్వీ అన్నారు. ఇప్పడు షర్మిల ఇండివిడ్యువల్.. కాంగ్రెస్ పార్టీ బాణం.. పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆ బాణం వల్ల వైసీపీ వారికి ఏం జరుగుతుందో చూడాలన్నారు. టీడీపీ, జనసేనల రెండు జెండాల కలయిక అద్భుతం.. ఇది మార్పుకు శుభసూచికమన్నారు
ఏపీలో రాజకీయాలపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహావిష్కరణకు విచ్చేసిన సినీ నటుడు పృథ్వీరాజ్ ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించారు.