Guntur Kaaram: ‘గుంటూరు కారం’ను ఎంజాయ్ చేయలేకపోయా: జగపతి బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagapathi Babu on Mahesh Babu’s Guntur Kaaram: ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ చిత్రంను తాను పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయా అని నటుడు జగపతి బాబు తెలిపారు. సినిమాలోని కొన్ని పాత్రల్లో మార్పులు చేస్తే బాగుండేదని, క్యారెక్టరైజేషన్ ఎక్కువగా ఉండటంతో గందరగోళం ఏర్పడిందన్నారు. తన పాత్ర కోసం చేయాల్సిందంతా చేశానని జగపతి బాబు చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. గత జనవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. గుంటూరు కారంలో నటించిన జగపతి బాబు తాజాగా సినిమాపై స్పందించారు.
ఓ జాతీయ మీడియాతో జగపతి బాబు మాట్లాడుతూ… ‘నేను ఎప్పుడూ మహేష్ బాబుతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను. కానీ నిజం చెప్పాలంటే గుంటూరు కారంను ఎంజాయ్ చేయలేకపోయా. ఎందుకంటే.. కొన్ని పాత్రల్లో మార్పులు చేస్తే బాగుండేది. క్యారెక్టరైజేషన్ కూడా ఎక్కువగా ఉండటంతో గందరగోళం ఏర్పడింది. సినిమాను ముగించడం కొంచెం కష్టమైంది. నా పాత్ర కోసం నేను చేయవలసిందల్లా చేశాను. ఇకపై మహేష్ బాబు, నా కాంబినేషన్‌ని వృథా చేయకూడదనుకుంటున్నాను. మా కాంబో ఉత్తమంగా ఉండాలి. ఆయనతో చేసిన మూవీ ఎప్పటికీ గుర్తుండిపోవాలనుకుంటా. మహేశ్ చిత్రాల్లో ఏ అవకాశాన్నీ వదులుకోను. శ్రీమంతుడు నాకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది’ అని అన్నారు.
Also Read
Also Read: CSK vs KKR: ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను: చెన్నై కెప్టెన్
గుంటూరు కారం చిత్రంలో జగపతి బాబు ప్రతినాయకుడిగా నటించారు. డొక్కా మార్క్స్ బాబుగా జగ్గూ భాయ్ నటించారు. ఒకప్పుడు హీరోగా ఎన్నో హిట్స్ అందుకున్న జగపతి బాబు.. విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి దూసుకుపోతున్నారు. లెజెండ్ సినిమాతో విలన్‌గా తనలోని మరో కోణాన్ని పరిచయం చేశారు. ఇటీవల సలార్, ‘గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..