సమ్మర్ వచ్చేసింది.. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి.. భానుడి తాపానికి జనాలు విలవిల లాడిపోతున్నారు.. ఎండనుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా కొన్ని చిట్కాలను తప్పక పాటించాలి.. ఈ చిట్కాలను పాటించడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి.. రోజుకు నాలుగు లీటర్ల వరకు నీటిని తాగడం మంచిది.. అలాగే బయటకి వెళ్లినప్పుడు వాటర్ బాటిల్ ను తీసుకెళ్లి నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, ఖర్బూజ, కీరదోస, నారింజ వంటి పండ్లను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఖనిజాలు, పోషకాలు అందుతాయి..
అదే విధంగా దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.. గాలి తగిలేలా, చెమట త్వరగా ఆరిపోయే దుస్తులను ధరించాలి. ముఖ్యంగా తెల్లటి దుస్తులు, పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించాలి. వీటిని ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ వేసవిలో ఆల్కహాల్, కేఫిన్ పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే మన శరీరంలో డీహైడ్రేషన్ కు గురి అయ్యిందని అర్థం.. ఇంకేదైన సమస్యగా ఉంటే వైద్యులను సంప్రదించాలి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.