Site icon NTV Telugu

CMR College : సీఎంఆర్‌ కాలేజ్‌ ఘటన.. కీలక విషయాలు వెల్లడించిన ఏసీపీ

Cmr College

Cmr College

CMR College : మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హాస్టల్ బాత్‌రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినులు ఆరోపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లలో రహస్యంగా కెమెరాలు అమర్చి, వీడియోలు తీస్తున్నారనే ఆరోపణలతో విద్యార్థినులు నిరసనకు దిగారు. ఈ పరిణామాలపై హాస్టల్ వంట సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. విద్యార్థినులు నినాదాలు చేస్తూ యాజమాన్యాన్ని వెంటనే స్పందించాలని కోరారు.

Israel-Hamas Conflict: ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య పోరు.. పాలస్తీనాలో అల్‌జజీరాపై నిషేదం

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్‌కు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత నాలుగుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు. అయితే.. తాజా ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎంఆర్‌ కాలేజ్ లో ఘటనపై మాకు ఫిర్యాదు అందిందని, హాస్టల్ గది లోని ఒక బాత్ రూం వద్ద కిటికీ లో నుంచి ఒక అగంతకుడు తొంగి చూసాడు అని ఫిర్యాదు అందిందని ఆయన పేర్కొన్నారు. స్పాట్ కి చేరుకుని కిటికీ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ క్లూస్ సేకరించామని ఏపీసీ వెల్లడించారు. అంతేకాకుండా.. మెస్‌లో పనిచేసే 5 మందిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేశారని, వాళ్ళను అదుపులోకి తీసుకున్నామన్నారు. వాళ్ళ మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని వీడియోస్ చెక్ చేస్తున్నామని, రికార్డ్ చేసి ఉంటే.. చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మొత్తం 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు. అయితే.. ఇదిలా ఉంటే.. ఈ ఘటన విద్యార్థినుల భద్రతపై సీరియస్ ప్రశ్నలు తెర మీదకు తీసుకురావడంతో, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

Sewerage Overflow Free City : హైదరాబాద్ సీవరేజీ ఓవర్ ఫ్లో నివారణ డ్రైవ్ విజయవంతం

Exit mobile version