Israel-Hamas Conflict: ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఓ కీలక పరిణామం జరిగింది. ఖతార్‌కు చెందిన అల్‌జజీరా వార్తా సంస్థపై పాలస్తీనా నిషేధం విధించింది. సాంస్కృతిక, అంతర్గత, సమాచార శాఖలతో కూడిన ప్రత్యేక మంత్రివర్గ కమిటీ అల్‌జజీరా వార్త సంస్థ ప్రసారాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. తప్పుడు సమాచారం వ్యాప్తి, రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రసారం చేయడం, పాలస్తీనా అంతర్గత వ్యవహారాల్లో ఆ సంస్థ జోక్యం చేసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కడ అమల్లో ఉన్న చట్టాలు, రూల్స్ ఉల్లంఘించినట్లు చెప్పారు. ఈ చర్యల వల్ల ఆ న్యూస్ సంస్థపై నిషేధం విధించినట్లు సమాచారం. వాటిని సరిదిద్దుకునే వరకు పాలస్తీనాలో జర్నలిస్టులు, ఉద్యోగులు, సిబ్బంది ఎలాంటి విధులు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేశారు. రమల్లాలోని తమ ఆఫీసుకి ప్రసార కార్యక్రమాలు నిలిపివేయాలనే ఉత్తర్వులు అందాయని అల్‌జజీరా వార్తా సంస్థ ఉద్యోగి ఒకరు వెల్లడించారు.
Read Also: AUS vs IND: సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ ఆడేది కష్టమే?: కోచ్ గౌతమ్ గంభీర్
అయితే, అల్‌జజీరా వార్తా సంస్థపై పాలస్తీనా అధికారులు నిషేధం విధించడంపై హమాస్ మిలిటెంట్లు ఖండించారు. ఈ నిర్ణయం ప్రజా హక్కులు, స్వేచ్ఛను కాలరాయడానికే పాలస్తీనా అథారిటీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని మండిపడింది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఆక్రమణను బహిర్గతం చేయడంతో పాటు మా ప్రజల యొక్క స్థిరత్వానికి సపోర్ట్ చేసే మీడియా కవరేజీని కొనసాగించాలని మిలిటెంట్ సంస్థ ప్రకటించింది. వెస్ట్ బ్యాంకులో అల్‌జజీరా రెచ్చగొట్టే ప్రసారాలు చేస్తుందని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ తెలిపారు. వీటిని ఆ సంస్థ డిసెంబర్ చివరిలోనే ఖండించినప్పటికీ.. ఈ క్రమంలోనే పాలస్తీనా చర్యలకు దిగింది.