Ayesha Takia: హేయ్ అయేషా నువ్వేనా? ఏమైంది నీకు.. ఇట్టా తయారయ్యావ్ ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayesha Takia officially deleted her Instagram handle: బాలీవుడ్ లో టార్జాన్ చిత్రంలో తన క్యూట్‌నెస్‌తో అందరి హృదయాలను గెలుచుకున్న అయేషా టకియా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గానే ఉంటోంది. తెలుగులో ఈ భామ సూపర్ సినిమాలో నాగార్జునతో అలరించింది. ఎందుకో ఏమో ఆ తరువాత ఆమె మరే తెలుగు సినిమా చేయలేదు. తాజాగా అయేషా తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఆమెను చూసి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఈ క్రమంలో ఈ ట్రోలింగ్ తర్వాత, అయేషా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆయేషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసింది. ఆయేషా అని సెర్చ్ చేస్తే ఆమె అకౌంట్ ఇక కనిపించదు. ఆయేషా షేర్ చేసిన ఫోటోలో, ఆమె నీలం – బంగారు రంగు చీర ధరించి ఉంది. ఆ పిక్ లో ఆమె మొహం చూసి చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందని కామెంట్ చేశారు.
AP Film Federation: ఇక ఏపీలో ఏ సినిమా షూటింగ్ జరిపినా మాకు చెప్పాల్సిందే!
Also Read
ఒకప్పుడు మీరు చాలా అందంగా కనిపించేవారు కానీ ఇప్పుడు సర్జరీ చేయించుకుని మీ ముఖాన్ని పాడు చేసుకున్నారని ఒకరు కామెంట్ చేశారు. ఇలాంటి కామెంట్స్ చూసి అయేషా బాధ పడ్డట్టుంది, అందుకే ఆమె సోషల్ మీడియా ఖాతాను తొలగించి తప్పుకుంది. ఆమె సినిమాల గురించి చెప్పాలంటే 2004 చిత్రం టార్జాన్‌తో బాలీవుడ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ దిల్ మాంగే మోర్, సోచా నా థా, షాదీ నెం. 1, షాదీ సే పెహ్లే, డోర్, సలామ్ ఇ ఇష్క్, క్యా లవ్ స్టోరీ హై, వాంటెడ్ లాంటి సినిమాలు చేసింది. చివరిగా ఆయేషా 2011లో వచ్చిన మోడ్‌లో కనిపించింది. ఆ తర్వాత అయేషా ఒక్క సినిమా కూడా చేయలేదు. అయేషా 2009లో ఫర్హాన్ అజ్మీని పెళ్లాడగా ఇద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయేషా తన భర్త మరియు బిడ్డతో సినిమాలకు దూరంగా తన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది. కొన్ని రోజుల క్రితం, అయేషా రీ ఎంట్రీ గురించి వార్తలు వచ్చినప్పుడు, ఆమె తాను తిరిగి రావాలని కోరుకోవడం లేదని చెప్పింది.
తాజావార్తలు
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!