Danger Stunt At Mumbai: ఈ మధ్యకాలంలో యువత సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చుట్టుపక్కల వారు ఎవరు ఏమనుకున్నా.. మన పని మనమే అన్నట్లుగా వారికి ఇష్టానుసారం పనులు చేసేస్తున్నారు. ఇలా కొందరు డేంజర్ స్టంట్స్ చేయడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి విషయాలకు సంబంధించిన అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడం గమనించే ఉంటాము. ఇకపోతే తాజాగా ముంబై నగరంలో ఓ రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి డేంజర్ స్టంట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింత వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Ponnam Prabhakar: ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా.. బీజేపీ, బీఆర్ఎస్ లపై పొన్నం ఫైర్
ముంబై నగరంలోని సెవ్రీ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి లోకల్ ట్రైన్ కదులుతున్న సమయంలో వ్యక్తి రైలు వాకిలి వద్ద ఒక కడ్డీని గట్టిగా పట్టుకొని రైల్వే ప్లాట్ ఫామ్ పై డేంజర్ విన్యాసాన్ని చేశాడు. ఈ సమయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగిన ఆ వ్యక్తి ఒక్కసారిగా ప్లాట్ఫామ్ నుండి ట్రైన్ కిందపడి ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు. ఆ వ్యక్తి అలా చేస్తుండగా మరో వ్యక్తి ఆ విన్యాసాన్ని తన సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. అయితే అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చివరికి ఆ వీడియో పై సెంట్రల్ రైల్వే స్పందించింది.
Ponguleti Srinivas Reddy: గ్రామపంచాయతీలో నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే..
ఈ వీడియోలో వ్యక్తిని ఎలాగైనా వెతికి అతనిపై చర్యలు తీసుకోవాలని ఆర్పిఎఫ్ సిబ్బందికి సెంట్రల్ రైల్వే ఆదేశించింది. దీంతో రైల్వే పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేసేందుకు పనిలో పడ్డారు. ఇకపోతే సెంట్రల్ రైల్వే తమ రైల్వే ప్రయాణికుల భద్రత కోసం వారి సురక్షితమైన ప్రయాణం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలో యువతి యువకులు, ప్రయాణికులు ఎవరైనా సరే ఇలాంటి డేంజరస్ విన్యాసం జోలికి వెళ్ళవద్దని., అలా చేసి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని కోరింది. ఒకవేళ మీ చుట్టుపక్కల ఇలాంటి విన్యాసాలు ఎవరైనా చేస్తుంటే అందుకు సంబంధించిన సమాచారాన్ని రైల్వే శాఖకు తెలపాలని ప్రయాణికులకు సెంట్రల్ రైల్వే విజ్ఞప్తి చేసింది.
Attn : @RailMinIndia @drmmumbaicr @grpmumbai @RPFCR @Central_Railway @cpgrpmumbai
Such Idiots performing Stunts on speeding #MumbaiLocal trains are a Nuisance just like the Dancers inside the trains.
Should be behind Bars.
Loc: Sewri Station.#Stuntmen pic.twitter.com/ZWcC71J44z
— मुंबई Matters™ (@mumbaimatterz) July 14, 2024