Bombay Highcourt: మైనరే కానీ ఆమెకు అన్నీ తెలుసు.. అత్యాచార నిందితుడికి బెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay Highcourt: 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు గత ఏడాది అరెస్టయిన 22 ఏళ్ల యువకుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు ప్రేమలో ఉన్నారని, ఆ అమ్మాయి మైనర్ అయినప్పటికీ పరిణామాలను అర్థం చేసుకోగలదని న్యాయస్థానం పేర్కొంది. నవంబర్ 15 నాటి ఉత్తర్వులో జస్టిస్ భారతి డాంగ్రే ధర్మాసనం బాలిక స్వచ్ఛందంగా అతడి వద్దకు వెళ్లిందని.. ఆమెకు ఆ చర్యలు పర్యవసానాలు అన్నీ తెలుసని పేర్కొంది. ఆమె మైనర్ అయినప్పటికీ ఆమె అతడిని ప్రేమిస్తున్నట్లు అంగీకరించింది, ఆమె లైంగిక సంపర్కానికి అంగీకరించిందా లేదా అనేది సాక్ష్యం అవుతుందని ధర్మాసని పేర్కొంది. బాలిక లైంగిక చర్యను ప్రతిఘటించిందా, ఏ సమయంలో నిందితుడు ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఆమెతో బలవంతంగా లైంగిక సంపర్కానికి పాల్పడ్డాడా అనేది విచారణ సమయంలో నిర్ధారించాల్సి ఉంటుందని పేర్కొంది.
నిందితుడు కూడా ఒక చిన్న పిల్లవాడని.. అతడు కూడా మోహానికి గురయ్యే అవకాశాన్ని కూడా తీసిపారేయలేమని.. అతను ఏప్రిల్ 2021లో అరెస్టు చేయబడినందున అతన్ని మరింతగా నిర్బంధించాల్సిన అవసరం లేదని.. విచారణకు చాలా సమయం పడుతుందని పేర్కొంటూ నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. బాలికతో ఎటువంటి పరిచయాన్ని ఏర్పరచుకోవద్దని, సబర్బన్ ముంబైలోని ఆమె నివాసం ఉన్న ప్రాంతంలోకి కూడా ప్రవేశించవద్దని కోర్టు అతడిని ఆదేశించింది.
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
Russia-Ukraine War: ప్రసూతి ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడి!.. శిశువు మృతి
భారతీయ శిక్షాస్మృతి (IPC), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (POCSOA) సంబంధిత నిబంధనల ప్రకారం నిందితుడిపై ఏప్రిల్ 29, 2021న బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు ఏప్రిల్ 6, 2021 న ముంబై శివారులోని తన అత్త ఇంటికి ఆ అమ్మాయి రాగా.. అతడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఏప్రిల్ 29న తన సోదరితో వాట్సాప్‌లో చాట్ చేస్తున్నట్టు కుటుంబసభ్యులు పట్టుకోవడంతో ఈ విషయాన్ని తన సోదరికి వెల్లడించినట్లు బాలిక తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిపై కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంలో జరిగిన ఈ జాప్యాన్ని హైకోర్టు కూడా వారి దృష్టికి తీసుకువెళ్లింది. ఆ బాలిక వాట్సాప్ చాట్‌ను ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసే వరకు బాలిక మౌనంగా ఉంది. ఆమె ఏప్రిల్ 6 నుండి మౌనంగా ఉండి, సంఘటనను ఏప్రిల్ 29న బహిర్గతం చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!