నెలలు నిండకుండానే జన్మించిన పసికందులకు ఎంజీంలోని పీడియాట్రిక్ యూనిట్ ఐసీయూ/హెచ్‌డీయూ వార్డుల్లో ట్రీట్మెంట్ అందిస్తుంటారు. వీరి కోసం రెండు వార్డుల్లో కలిపి నాలుగు చొప్పున 8 ఏసీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి పని చేయడం లేదు.. ఓ వైపు ఎండలతో ఉష్ణోగ్రత స్థాయి పెరిగి పసికందులు తల్లడిల్లిపోతున్నాయి.