దబిడిదబిడి అంటూ బాలయ్యతో చిందులేసిన బాలీవుడ్ సోయగం ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ చేస్తూ కాక రేపుతోంది. మసాలా మ్యాగజైన్ కోసం ఆమె ఇచ్చిన ఫోజులు నెటిజన్లకు పిచ్చెక్కిస్తున్నాయి. బ్రౌన్ థై స్లిట్ గౌనులో హీట్ పుట్టిస్తోంది అమ్మడు. ఇందులో ఆమె చాలా నాజూగ్గా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. డ్రెస్సుకు తగ్గట్టుగా సిల్వర్ డిజైనర్ జ్యుయెలరీ ధరించి టాలెంట్ చూపిస్తోంది బోల్ట్ బ్యూటీ.
Also Read : NANI : హిట్ 3 సెన్సార్.. రన్ టైమ్ వివరాలు ఇవే
డాకు మహారాజ్‌లో స్టెప్స్ వివాదానికి దారి తీసినా తను ఇవ్వాల్సినంత స్టఫ్ ఇచ్చి అందాల జాతర చేసింది. ఇందులో ఆమె ఫెర్ఫామెన్స్‌కు రీసెంట్లీ ఫ్యాన్స్ ఫేవరేట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ 10న విడుదలైన జాట్ మూవీలో ఐటమ్ సాంగ్‌కు చిందులేసింది. పేరుకు హీరోయిన్ అయినప్పటికీ గ్లామరస్ రోల్స్, బోల్డ్ లుక్స్‌లోనే దర్శనమిచ్చింది అమ్మడు. ఎక్కువగా స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకున్న బ్యూటీ హీరోయిన్ ఛాన్సుల విషయంలో స్వయంగా సెల్ఫ్ గోల్ వేసేసుకుంది. ప్రజెంట్ మేడమ్ చేతిలో రెండు బాలీవుడ్ మూవీస్ ఉన్నాయి. వెల్కమ్ టు ది జంగిల్, కసూర్ 2 చేస్తోంది ఊర్వశి. తెలుగులో వాల్తేరు వీరయ్య కన్నా ముందే బ్లాక్ రోజ్ అనే మూవీతో రావాల్సి ఉంది ఊర్వశి రౌతేలా. షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు టాక్. సంపత్ నంది స్టోరీ అందించిన సినిమా నుండి సాంగ్ రిలీజ్ చేయగాట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. గ్లామర్ ట్రీట్ ఇవ్వడంతో హీరోయిన్ మెటీరియల్ కాదని గుర్తించి మెల్లిగా స్పెషల్ సాంగ్స్‌తో సరిపెట్టేసుకుంటోంది భామ . కానీ ఐటమ్ గర్ల్స్‌కు కెరీర్ స్సాన్ చాలా తక్కువ. కొత్త భామలొస్తే ఓల్ట్ గ్లామర్ గర్ల్ షెడ్డుకు వెళ్లాల్సిందే.. ఈ లెక్కన మేడమ్ ఎన్ని రోజులు ఇండస్ట్రీలో కొనసాగుతుందో చూడాలి.