ఆసియా కప్ 2025లో అభిషేక్ శర్మ సెంచరీ చేయాలని తాను కోరుకుంటున్నట్లు సోదరి కోమల్ శర్మ చెప్పారు. సెంచరీ కోసమే తాను వెయిటింగ్ చేస్తున్నానని వెల్లడించారు. అభిషేక్ అద్భుతమైన టాలెంట్ కలిగిన ప్లేయర్ అని, అతడికి ఆకాశమే హద్దు అని తెలిపారు. అభిషేక్ ఆట చూడటం బాగుందని, దాయాది పాకిస్థాన్‌పై ఇన్నింగ్స్‌ను ఆస్వాదించాం అని అభిషేక్ తల్లి మంజు శర్మ చెప్పుకొచ్చారు. 2025 ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ చెలరేగాడు. 39 బంతుల్లోనే 74 పరుగులు చేసి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిషేక్ శర్మ తల్లి మంజు, సోదరి కోమల్ దుబాయ్‌కు వెళ్లారు. అభిషేక్ బంతిని బాదినప్పుడల్లా ఇద్దరు తెగ ఎంజాయ్ చేశారు. మ్యాచ్ అనంతరం ఇద్దరూ మాట్లాడుతూ తమ ఆనందం వ్యక్తం చేశారు. ‘భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రతిసారి నేను చూడాలనుకుంటా. ఇన్నాళ్లకు ప్రత్యక్షంగా చూశాం. అభిషేక్ బాగా ఆడాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావడం కంటే ఇంకే కావాలి?. సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, మేం చాలా ఆనందంగా ఉన్నాము. అభిషేక్ అద్భుత టాలెంట్ ఉన్న ప్లేయర్. త్వరలోనే అభిషేక్ బ్యాట్ నుంచి సెంచరీ చూస్తానని అనుకుంటున్నా. సెంచరీ కోసమే నేను వెయిటింగ్’ అని కోమల్ శర్మ తెలిపారు.
Also Read: Jacqueline Fernandez: ఖరీదైన బహుమతులు, లగ్జరీ లైఫ్.. జాక్వెలిన్‌కు సుప్రీం షాక్
‘అభిషేక్ శర్మ ఆట చూడటం చాలా బాగుంది. పాకిస్థాన్‌పై ఇన్నింగ్స్‌ను నెను బాగా ఎంజాయ్ చేశా. తొలి బంతికే సిక్స్ కొట్టడం నేను మరిచిపోలేను. ప్రత్యర్థి బౌలర్ ఎవరనేది చూడకుండా.. అభిషేక్ ధైర్యంగా ఆడుతాడు. దానిని ఎప్పటినుంచో ఓ అలవాటుగా మార్చుకున్నాడు. మీ మద్దతు ఇలాగే ఉంటే.. భారతదేశం కోసం మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడతాడు. ఆసియా కప్ 2025లో తప్పకుండా సెంచరీ చేస్తాడని నేను నమ్మకంగా ఉన్నా’ అని అభిషేక్ తల్లి మంజు తన ఆనందం వ్యక్తం చేశారు. అభిషేక్ ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్‌పై భారత్ సునాయాస విజయం సాధించింది.