Jacqueline Fernandez: ఖరీదైన బహుమతులు, లగ్జరీ లైఫ్.. జాక్వెలిన్‌కు సుప్రీం షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుప్రీం కోర్ట్ నుండి భారీ షాక్ తగిలింది. ఆమెపై ఉన్న రూ.215 కోట్ల ఈడీ కేసును కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఈ కేసు విచారణ కొనసాగనుంది. ఈ కేసు వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే.. రూ.200 కోట్ల దోపిడీ కేసు. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఇందులో ప్రధాన నిందితుడు. ఈ డబ్బు నుంచి జాక్వెలిన్ లబ్ధి పొందినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. సుకేశ్ దోపిడీదారుడని తెలిసినా, ఆయనతో సంబంధాలు కొనసాగించారని అధికారులు పేర్కొన్నారు.
Also Read : Maa Vande: ‘మా వందే’ నుండి మోదీ లుక్ పోస్టర్ రిలీజ్
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
సుకేశ్ నుంచి జాక్వెలిన్ అనేక విలాసవంతమైన కానుకలు స్వీకరించినట్లు దర్యాప్తులో బయటపడింది. అందులో డిజైనర్ బ్యాగులు, జిమ్ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్‌లెట్, మినీ కూపర్ కారు వంటి బహుమతులు ఉన్నాయి. వీటి మొత్తం విలువ దాదాపు రూ.10 కోట్లకు పైగా ఉంటుందని ఈడీ అంచనా వేసింది. అంతేకాకుండా, ఈ బహుమతులు జాక్వెలిన్ కుటుంబ సభ్యులకు కూడా అందించబడినట్లు గుర్తించారు. జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు, లగ్జరీ లైఫ్‌ను ఆస్వాదించిన నేపథ్యంలో ఆమెపై విమర్శలు పెరిగాయి. ఈడీ సాక్ష్యాధారాలతో కోర్టులో బలంగా వాదిస్తోంది. ఇక సుప్రీంకోర్ట్ పిటిషన్ తిరస్కరించడంతో, జాక్వెలిన్ లీగల్ పోరాటం మరింత కఠినంగా మారింది.
సినిమాలతో బిజీగా ఉండాల్సిన ఈ సమయంలో జాక్వెలిన్ నిరంతరం కేసుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆమె భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగా మారింది. ఈ కేసు తుది ఫలితం ఆమె కెరీర్ మీద ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!