Suryakumar Yadav: పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ ఎంట్రీపై బాంబు పేల్చిన కెప్టెన్ సూర్యకుమార్..

Abhishek Sharma

Abhishek Sharma

Suryakumar Yadav: టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్ ఉత్కంఠ బరితంగా సాగనుంది. ఈ నేపథ్యంలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఎంట్రీపై అభిమానులు ఎదురు చూస్తున్నారు. టీమిండియాకు కీలక ఓపెనర్‌గా మారిన అభిషేక్ శర్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా.. పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న సందేహం ఇంకా కొనసాగుతోంది. కడుపు ఇన్‌ఫెక్షన్, నొప్పి కారణంగా అభిషేక్ రెండు రోజుల పాటు ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందాడు. బుధవారం డిశ్చార్జ్ అయినా.. గురువారం ఢిల్లీలోని కోట్లా మైదానంలో జట్టు ప్రాక్టీస్ కి రాలేదు. ఈ అంశపై నమీబియాపై అద్భుతంగా బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. “నేను మాట్లాడినంతవరకు అభిషేక్ బాగానే ఉన్నాడు. కొంత ప్రాక్టీస్ కూడా చేశాడు. తాను త్వరలో మ్యాచ్‌కు సిద్ధమవుతానని చెప్పాడు.” అని వెల్లడించాడు.

READ MORE: Tamil Nadu: ఎన్నికల వేళ మహిళలకు బొనాంజా.. ఖాతాల్లో రూ.5 వేలు జమ

ఈ అంశంపై ఇప్పటికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ అనంతరం మాట్లాడుతూ.. “అభిషేక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మిస్ కావచ్చు” అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలతో పాకిస్థాన్ మ్యాచ్‌కు అభిషేక్ ఎంట్రీపై సందిగ్ధం తీవ్రమైంది. అభిషేక్ లేకపోవడంతో నమీబియా మ్యాచ్‌లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా దిగారు. అయితే పాకిస్థాన్ వంటి కీలక మ్యాచ్‌లో అభిషేక్ లాంటి దూకుడు ఆటగాడు జట్టుకు చాలా అవసరం. ఇలాంటి సందర్భంలో యాజమాన్యం, కోచ్‌లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కడుపు ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉంటే శరీరంలో నీరు తగ్గి బరువు కూడా తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితిలో మళ్లీ పూర్తి స్థాయి శక్తి, సహనం రావడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

READ MORE: Mega Twins : రామ్ చరణ్ ఉపాసనల ట్వీన్స్ పేర్లు ఇవే.. స్వయంగా వెల్లడించిన రామ్ చరణ్