Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Porel: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. 36 రోజుల జైలు జీవితం గడిపాడు. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చి.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచం దృష్టిని తన వైపునకు తిప్పుకున్నాడు బెంగాల్ బ్యాటర్ అభిషేక్ పోరెల్. ఢిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అభిషేక్ పోరెల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. మూడంకెల స్కోరు సాధించి ఎంతో భావోద్వేగానికి గురైన తీరు అందరినీ కలచివేసింది. మొదటి రోజు ఆట ముగిసేసరికి 114 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన అభిషేక్, ఆ తర్వాత రోజు మొత్తం 149 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 228 బంతులు ఎదుర్కొని, 17 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు.
జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే బ్యాట్‌తో గట్టి సమాధానం చెప్పాడు అభిషేక్ పోరెల్. మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తన భావోద్వేగాలపై స్పందించాడు. సెంచరీ సాధించిన వెంటనే తాను ఏడవాలనుకోలేదని, కానీ ఆ కన్నీళ్లు వాటంతట అవే వచ్చాయని తెలిపాడు. గడిచిన రెండు నెలలు తన జీవితంలో ఒక రోలర్‌కోస్టర్ లాంటి అనుభూతినిచ్చాయని, ఆ కష్టకాలం నుంచి ఎన్నో సానుకూల అంశాలను నేర్చుకున్నానని చెప్పాడు. వేరే ప్రపంచంలో, వేరే విశ్వంలో ఎలా బ్రతకాలో తాను చూశానని, అక్కడ గడిపిన ప్రతి రోజూ, ప్రతి నిమిషం, ప్రతి సెకను తనను మానసికంగా మరింత దృఢంగా మార్చాయని తెలిపాడు. తాను నోటితో ఎవరికీ సమాధానం చెప్పనని, కేవలం తన బ్యాట్‌తోనే బదులిస్తానని క్రీజులో ఉన్న ప్రతి క్షణం తనకు తానే గుర్తుచేసుకున్నట్లు అభిషేక్ వెల్లడించాడు.
Also Read
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
అసలు ఈ వివాదం వెనుక ఏం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన ఓ మెడికల్ విద్యార్థిని జూన్ 23న మొగ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సుమారు మూడేళ్లన్నర కాలంగా తాము రిలేషన్షిప్లో ఉన్నామని, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నామని ఆమె పేర్కొంది. అంతేకాకుండా తామిద్దరం కలిసి విదేశాలకు కూడా వెళ్లినట్లు, కానీ ఆ తర్వాత అభిషేక్ పోరెల్ తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని తిరస్కరించినట్లు ఆమె ఆరోపించింది. అయితే అప్పట్లో ఆమె పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. ఆ తర్వాత సుమారు ఏడాదిన్నర క్రితం వారి మధ్య వివాదం తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇటీవల సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, చందన్ నగర్‌లోని అభిషేక్ ఇంటికి పలు సార్లు వెళ్లినా అతడు అందుబాటులో లేడు. దీంతో ఆ మహిళ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. జూలై 20న అభిషేక్‌ను అరెస్ట్ చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ఆగస్టు 11న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దాదాపు నెల రోజులకు పైగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తర్వాత అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆడిన తొలి మ్యాచ్‌లో సెంచరీతో విరుచుకుపడ్డాడు.
తాజావార్తలు
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!