CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే అభిజీత్ దిప్కే, సౌరభ్ దాస్, రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా ఫ్లైట్ లోపలే పోలీసులు ఈ యాక్షన్ తీసుకోవడం గమనార్హం. “మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచబోం” అంటూ పోలీసుల అదుపులో ఉన్న దీప్కే, సౌరభ్, రాంకాలు నినదించారు. ఇక, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న భారీ నిరసన ప్రదర్శనకు ముందే ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో సహా ఇప్పటివరకు సుమారు 150 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఫౌండర్ అభిజీత్ దిప్కే ముంబైలోని తన ఇల్లు నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకోగానే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలా ఎక్కడికక్కడ ప్రదర్శనకారులను పోలీసులు ఏరివేస్తూ నిర్బంధిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆందోళనకారులు జంతర్ మంతర్ చేరుకోకుండా ఢిల్లీ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఢిల్లీ సరిహద్దులన్నింటి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి మరీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎవరి మీదైనా అనుమానం వస్తే చాలు, క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు.
మరోవైపు, ఈ నిరసనను అణచివేయడానికి ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కీలకమైన మెట్రో స్టేషన్లతో పాటు మార్కెట్లను కూడా మూసివేశారు. ఢిల్లీకి వచ్చే డజన్ల కొద్దీ రైళ్లను రద్దు చేయడంతో పాటు, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాకుండా, నిరసనకారులు ఎవరూ ఢిల్లీకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఇటువంటి కట్టుదిట్టమైన భద్రతా వలయాల మధ్యే అభిజీత్ దిప్కే, సౌరభ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీలను పోలీసులు అరెస్ట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!