Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
- నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది
- అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
- మహారాష్ట్రలో కుటుంబ సభ్యులు సంబరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన కొడుకు కష్టానికి ఫలితం దక్కిందని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే తల్లి అనితా దీప్కే సంతోషం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నెల రోజులకు పైగా ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఈ ఉద్యమానికి దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు. మొత్తానికి శనివారం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో అభిజిత్ దీప్కే కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో మీడియాతో మాట్లాడిన అభిజిత్ దీప్కే తల్లి అనితా దీప్కే తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది మా కుటుంబానికి చాలా ప్రత్యేకమైన రోజు. నా కొడుకు చేసిన నిజాయితీ పోరాటానికి చివరకు ఫలితం దక్కింది. అతను మొదటి నుంచే తన డిమాండ్ నెరవేరాల్సిందేనని గట్టిగా చెప్పేవాడు. తన లక్ష్యాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గలేదు.’’ అని తెలిపారు. అయితే కొడుకు ఢిల్లీలో నిరసనలో పాల్గొంటున్న సమయంలో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైందని చెప్పారు.
Also Read
- CJP: "ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే".. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
- Sharad Pawar: "మోడీ నా మాట విన్నారు".. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
- CJP Protest: 3 డిమాండ్లు కేంద్రం అంగీకరించింది.. ఆందోళన విరమించినట్లుగా సీజేపీ ప్రకటన
- Delhi: జంతర్‌మంతర్‌ను ఖాళీ చేసిన విద్యార్థులు.. ఇళ్లకు వెళ్లిపోతున్న నిరసనకారులు
‘‘అతనితో పాటు చాలా మంది విద్యార్థులు ఉన్నప్పటికీ.. తల్లిదండ్రులుగా మాకు భయంగానే ఉండేది. జైపూర్‌లో అతనిపై దాడి చేసి చెంపదెబ్బ కొట్టిన ఘటన మాకు తీవ్ర బాధ కలిగించింది. ఆ రోజు రాత్రంతా మేము నిద్రపోలేకపోయాం.’’ అని భావోద్వేగానికి గురయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తమ కుమారుడికి ఘన స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నామని అనితా దీప్కే తెలిపారు. కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకుంటామని పేర్కొన్నారు.
#WATCH | Chhatrapati Sambhajinagar, Maharashtra | After Union Minister Dharmendra Pradhan resigns, Anita Dipke, mother of Cockroach Janta Party’s Founding President Abhijeet Dipke, says, “I feel very happy today. It has been a wonderful day. I am extremely happy. He has finally… pic.twitter.com/gG53MhlO8H
— ANI (@ANI) July 25, 2026
తాజావార్తలు
-
Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
-
CJP: “ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే”.. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
-
Sharad Pawar: “మోడీ నా మాట విన్నారు”.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!