ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్న యువతకు మంచి అవకాశం. కాకినాడ నగరంలో జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ(డీఎస్‌ఏ) మైదానంలో రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈనెల 20 వరకు ర్యాలీ జరగనున్నది. 12 జిల్లాల నుంచి అభ్యర్థులు పాల్గొనున్నారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, కోనసీమ, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరవుతారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయిన 15 వేలు మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 1.6 కిలోమీటర్ల రన్, మెడికల్ అండ్ ఫిట్ నెస్ టెస్ట్ లు, లాంగ్ జంప్, ఫుల్ ఆప్స్, నైన్ ఫీట్ డిచ్ అండ్ జిగ్ జాగ్ ఈవెంట్లు నిర్వహించనున్నది ఆర్మీ. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు అధికారులు.