AAP Bihar Candidates List: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నగరా మోగించింది. ఈక్రమంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని పార్టీల కంటే ముందే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోమవారం 11 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించి సంచలనం సృష్టించింది. బీహార్‌లో 243 మంది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ జూలైలో ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ, బీహార్ ఎన్నికల్లో మాత్రం తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
READ ALSO: Rajinikanth: పేరుకే సూపర్ స్టార్.. కానీ ఇంత సింప్లిసిటీ ఏంటయ్యా? రోడ్డు పక్కన భోజనం చేస్తూ..
2020 బిహార్ ఎన్నికల పోలింగ్ ఎప్పుడు జరిగిందంటే..
గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. మొదటి దశ అక్టోబర్ 28న, రెండవ దశ నవంబర్ 3న, మూడవ దశ నవంబర్ 7న జరిగాయి. ఎన్నికల ఫలితాలను నవంబర్ 10న ప్రకటించారు. భారత ఎన్నికల సంఘం (ECI) నివేదికల ప్రకారం.. 2020 బీహార్ ఎన్నికలలో మొత్తంగా 57.05 శాతంగా పోలింగ్ నమోదు అయ్యింది. మొదటి దశలో 55.68 శాతం, రెండవ దశలో 55.70 శాతం, మూడవ దశలో 59.94 శాతం నమోదయ్యాయి. 2020 బీహార్ ఎన్నికల్లో అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 125 స్థానాలను గెలుచుకుని విజయం సాధించింది. అదే సమయంలో రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వంలోని మహాఘటబంధన్ 110 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది.
ఆప్ ప్రకటించిన 11 మంది అభ్యర్థుల జాబితా..
డాక్టర్ మీరా సింగ్ – బెగుసరాయ్ (బెగుసరాయ్)
యోగి చౌపాల్ – కుశేశ్వరస్థాన్ (దర్భంగా)
అమిత్ కుమార్ సింగ్ – తారయ్య (సరణ్)
భాను భారతీయ – కస్బా (పూర్ణియ)
శుభదా యాదవ్ – బేనిపట్టి (మధుబని)
అరుణ్ కుమార్ రజక్ – ఫుల్వారీ షరీఫ్ (పాట్నా)
డాక్టర్ పంకజ్ కుమార్ – బంకీపూర్ (పాట్నా)
అష్రఫ్ ఆలం – కిషన్‌గంజ్ (కిషన్‌గంజ్)
అఖిలేష్ నారాయణ్ ఠాకూర్ – పరిహార్ (సీతామర్హి)
అశోక్ కుమార్ సింగ్ – గోవింద్గంజ్ (మోతిహారి)
మాజీ కెప్టెన్ ధరమ్‌రాజ్ సింగ్ – బక్సర్ (బక్సర్)