ఈ ఏడాది టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పెద్దగా రాణించిన సందర్భాలు లేవు. ఐపీఎల్ 2023 సహా భారత్ తరఫున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో హాఫ్ సెంచరీ (82) చేశాడు. అయితే వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో విఫలమయ్యాడు. పొట్టి సిరీస్‌లో కెప్టెన్ అయిన హార్దిక్ 77 పరుగులే చేశాడు. త్వరలో ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 ఉండటంతో హార్దిక్ ఫామ్‌పై మాజీలతో సహా ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.
తాజాగా హార్దిక్ పాండ్యా ఫామ్‌పై భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశాడు. స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ 2023 ముందు అతడు ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఎంతో ఉందన్నాడు. ‘హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా పరుగులు సాధించాలి. ఐపీఎల్ 2023లో రన్స్ చేయలేదు. గత కొన్ని సిరీస్‌ల్లో కూడా పెద్దగా రాణించలేదు. వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఆసియా కప్, ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో హార్దిక్ ఫామ్‌ను అందుకోవాలి. ఇదే అందరూ కోరుకుంటున్నారు’ అని పార్థివ్ అన్నాడు.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే.. భారత్ మరో లెవల్లో ఉండేది: రషీద్
మరోవైపు హార్దిక్ పాండ్యా ఫామ్‌పై కామెంటేటర్, భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. ఎదుర్కొన్న బంతుల కంటే.. ఎక్కువ పరుగులు చేసిన సందర్భాలను వేళ్లపై లెక్కపెట్టొచ్చన్నాడు. ‘2022 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు వరకు హార్దిక్ 25 మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో 4 లేదా అంతకంటే దిగువ స్థానాల్లో బ్యాటింగ్ చేసిన వారి స్ట్రైక్‌రేట్‌ని పరిశీలిస్తే.. హార్దిక్ కింది నుంచి మూడో స్థానంలో ఉన్నాడు. మునుపటిలా భారీ హిట్టింగ్ కూడా చేయడం లేదు. ఇటీవలి అతడి అంతర్జాతీయ గణాంకాలు బాగాలేవు. గత 10 టీ20ల్లో అతడు ఎదుర్కొన్న బంతుల కంటే.. ఎక్కువ పరుగులు చేసింది కేవలం రెండు లేదా మూడుసార్లే’ అని ఆకాశ్ మండిపడ్డాడు.