NTV Telugu Site icon

Aadi Srinivas : హరీష్‌రావు చిట్ చాట్.. సోది చాట్‌లాగా ఉంది

Aadi Srinivas

Aadi Srinivas

హరీష్ రావు చిట్.. చాట్ సోది చాట్ లాగ ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్‌ రావు చీప్ పాలిటిక్స్ కు తెరలేపుతుండు అని ఆయన ఆరోపించారు. మూసి నదిపై ఆక్రమంగా కట్టిన కట్టడాలను కూలగొడితే బీఆర్ఎస్ నాయకులకు వచ్చిన నష్టం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పది ఏండ్లలో చేయలేని పని.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఈర్శ తో హరీష్ రావు మాట్లాడుతుండు అని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అక్రమంగా బుల్డోజర్లు పెట్టి కూలగొడితే ఈటెల రాజేందర్ ఎందుకు మాట్లాడలేదని, సీఎం రేవంత్ రెడ్డి ఎనిమిది నెలల్లో 70వేల కోట్లు పెట్టుబడులు తెచ్చిండన్నారు ఆది శ్రీనివాస్‌. వరంగల్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తెలంగాణలో నెరవేరుతుందని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ విశ్వాసం పొందాడు కాబట్టే రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు అని, వరంగల్ లో రాహుల్ గాంధీ సభ ఖచ్చితంగా ఉంటది అని ఆయన వెల్లడించారు.

  Railway Station Collapses: మిజోరంలో కొండచరియలు విరిగిపడి కుప్పకూలిన రైల్వే స్టేషన్

ఆక్రమించిన చెరువులను, కుంటలను హైడ్రా కాపాడుతుంది… మీరు హైడ్రాను స్వాగతిస్తున్నారా లేదా అని ఆది శ్రీనివాస్‌ అన్నారు. అనుమతులు లేని ఎన్ కన్వేషన్ ను కూల్చడాన్ని మీరు స్వాగతిస్తున్నారా లేదా.. హరీష్ రావు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నియమ నిబంధనల ప్రకారమే హైడ్రా ముందుకు పోతుందని, హైడ్రా పరిధిలోని నష్టపోయిన పేదల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తుండన్నారు. నా పై బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తుండని, తప్పుడు నా సొంత గ్రామంలో 3వేల మందికి రుణమాఫీ అయిందన్నారు. రుణమాఫీ కాలేదని కేవలం 50 మంది దరఖాస్తు పెట్టుకున్నారని ఆయన వెల్లడించారు.

 Chicken Biryani: బిర్యానీ తినండి, లక్ష పట్టుకెళ్లండి.. ఓ రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్