Tatkal Ticket – Aadhaar: భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన ప్రకారం 2025 జూలై 1 నుండి తత్కాల్ టిక్కెట్లు బుక్ చేయాలంటే ఆధార్ ఆధారిత వేరిఫికేషన్ తప్పనిసరి కానుంది. 2025 జూన్ 10న విడుదలైన సర్క్యులర్‌లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మార్పు వల్ల తత్కాల్ ప్రయోజనాలు సాధారణ ప్రయాణికులకు చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది రైల్వే శాఖ. అదేవిధంగా, జూలై 15, 2025 నుండి తత్కాల్ బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణ కూడా తప్పనిసరి కానుంది. కాబట్టి, ఎవరైతే IRCTC ఖాతాను కలిగి ఉన్నారో తమ ఆధార్ నంబర్‌ను లింక్ చేసి ధృవీకరించాలంటూ వినియోగదారులకు సూచిస్తోంది.
Read Also: Best Battery Smartphones: బడ్జెట్ ధరలో మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్స్ ఇవే..!
IRCTC ఖాతాకు ఆధార్ ధృవీకరణ ఎలా చేయాలి?
మొదట IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ను సందర్శించండి. అక్కడ మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. ఆ తర్వాత ‘My Account’ సెక్షన్‌లోకి వెళ్లి ‘Authenticate User’ ను ఎంచుకోండి. ఆపై మీ PAN నంబర్, ఆధార్ నంబర్ లేదా Virtual ID ఎంటర్ చేయండి. చివరగా ‘Verify Details’ పై క్లిక్ చేయండి. దానితో మీ ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్‌కు వచ్చే OTPను ఎంటర్ చేసి, కన్సెంట్ టిక్‌బాక్స్ ను సెలెక్ట్ చేసి ‘Submit’ క్లిక్ చేయండి. అంతే సింపుల్.. మీ ఆధార్ మీ IRCTC ఖాతాకు ధృవీకరించినట్లే.. ఒకవేళ ధృవీకరణ విఫలమైతే, వివరాలను సరిచూసి మళ్లీ ప్రయత్నించండి. ధృవీకరణ స్థితిని “Authenticate User” లింక్‌లో చెక్ చేయవచ్చు.
Read Also: Wicket Keeper Catch: నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..
IRCTC ఖాతాలో ఆధార్ లింక్ చేయడం విషయానికి వస్తే.. IRCTC పోర్టల్‌లో లాగిన్ అయ్యాక.. “Profile Tab” లో “Link Aadhaar” పై క్లిక్ చేయండి. అక్కడ ఆధార్ కార్డు మీద ఉన్న పేరు, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఆపై టిక్‌బాక్స్‌ను సెలెక్ట్ చేసి “Send OTP” పై క్లిక్ చేయండి. దానితో మీ ఆధార్ లింక్ అయిన మొబైల్‌కు వచ్చిన OTPను ఎంటర్ చేసి “Verify OTP” పై క్లిక్ చేయండి. అంతే ఆధార్ నుంచి మీ KYC వివరాలు తీసుకుని చూపబడతాయి. వాటిని కన్ఫర్మ్ చేసి “Update” క్లిక్ చేయండి. అంతే.. వెరిఫికేషన్ పూర్తైన తర్వాత పాపప్ సందేశం ద్వారా ధృవీకరణ విజయవంతమైందని చూపిస్తుంది.