Aadhaar Ration Card Link: ఆధార్, రేషన్ కార్డు లింక్ గడువు పెంపు.. ఎప్పటివరకంటే?
- జూన్ 30తో ముగిసిన గడువు
- సెప్టెంబర్ 30 వరకు అవకాశం
- స్థానిక ఎస్ సీ సెంటర్లలో చేసుకోవచ్చని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధార్-రేషన్ కార్డు లింక్ పై కేంద్రం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆధార్-రేషన్ కార్డు లింక్ చేసుకోని వారికి మరో అవకాశం కల్పించింది. జూన్ 30తో ఉన్న గడువును మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, విద్య, వైద్య పథకాలకు తెల్ల రేషన్ కార్డు కీలకం. వైట్ రేషన్ కార్డుదారులను ప్రభుత్వ పథకాలకు అర్హులుగా తీసుకుంటారు. అయితే రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆధార్-రేషన్ కార్డులను లింక్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అనుసంధాన ప్రక్రియ ప్రారంభించింది. రేషన్ డీలర్లు ఈ ప్రక్రియను చేపట్టారు.
READ MORE: Rajasthan: ఆ గ్రామంలో అందరూ ధనవంతులే.. ప్రభుత్వానికి ఏటా 5కోట్ల పన్నులు చెల్లిస్తారు
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
2024 జూన్ 30తో గడువు ముగియనుండగా.. సెప్టెంబర్ 30 వరకు పెంచింది. ఆధార్- రేషన్ కార్డు అనుసంధానం వల్ల అర్హులైన వారందరికీ ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఆధార్- రేషన్ కార్డ్ అనుసంధానం చేయని వారు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని కోసం సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC) సాయంతో లింక్ చేయించుకోవచ్చు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ పాటు అవసరమైన పత్రాలు అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో అనుసంధానం పూర్తి చేయొచ్చు. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అనుసంధానం చేసే సదుపాయం కూడా ఉంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?