రేపు మొదలు కానున్న ఐపీఎల్ 2024 సీజన్ తరుణంలో ముంబై ఇండియన్స్ జట్టులో ఓ పెను మార్పు చేసింది. 17ఏళ్ల పేసర్ క్వెనా మఫకాను ముంబై ఇండియన్స్ టీమ్‍లోకి తీసికుంది. అండర్ 19 ప్రపంచకప్ లో అద్భుతంగా బౌలింగ్ వేసిన ఈ 17 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ను ఎంపిక చేసుకుంది ముంబై.
Also Read: Pawan Kalyan: ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోన్న పవన్ కల్యాణ్.. రోడ్డెక్కనున్న వారాహి..
ఇకపోతే శ్రీలంక స్టార్ పేస్ బౌలర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా ఈ సీజన్ కు ముంబై ఇండియన్స్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతడికి రిప్లేస్‍మెంట్ గా మఫకాను ముంబై తీసుకోనుంది.
ఈ ఏడాది మొదట్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ లో సౌత్ ఆఫ్రిక తరుపున క్వెనా మఫకా అద్భుతంగా బౌలింగ్ చేసి ఏకంగా 21 వికెట్లను పడగొట్టాడు. ఒక్క అండర్ 19 ప్రపంచకప్ ఎడిషన్ లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్ గా అతను రికార్డు సృష్టించాడు.
ముఖ్యంగా ప్రపంచకప్ లో డెత్ ఓవర్లలో క్వెనా మఫకా బౌలింగ్ అదరగొట్టాడు. తన యార్కర్లతో ఎదుటి బ్యాటర్లని భయపెట్టాడు. దీంతో ఈ దక్షిణాఫ్రికా అన్‍క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ ను జట్టులోకి తీసుకోబోతుంది ముంబై ఫ్రాంచైజీ. ముంబై ఇండియన్స్ క్వెనా మఫకాను రూ.50లక్షల బేస్ ప్రైజ్‍తో తీసుకుంది. ఐపీఎల్ 17 వ సీజన్ మార్చి 22, 2024 టోర్నీ మొదలుకానుంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ను ముంబై ఇండియన్స్ జట్టు మార్చి 23వ తేదీన గుజరాత్ టైటాన్స్ జట్టుతో ఆడనుంది. ఇక ఈ సీజన్ కోసం అనేక చర్చల తర్వాత రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించింది ముంబై ఫ్రాంచైజీ.