NTV Telugu Site icon

Love Cheating: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి.. మోజు తీరాక..!

Ap

Ap

ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసి తీరా మోజు తీరిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఆ ఘనుడు ముఖం చాటేశాడు. గర్భవతి అని తెలిసి మందుల ద్వారా గర్భస్రావం చేయించాడు. విషయం కాస్త యువతి తల్లిదండ్రులకు తెలియడంతో అసలు బాగోతం బయటపడింది. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయడంతో ఆ ఘనుడు పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శ్రీనివాసపురంలో చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికపై ప్రేమ పేరుతో గర్భవతిని చేసిన సతీష్ అనే యువకుడు పెళ్లి చేసుకోమని కోరితే ముఖం చాటేస్తున్నాడు.

Read Also: Minister Ram Prasad: ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను జగన్ ఓర్వలేకపోతున్నాడు..

కొవ్వూరు శ్రీనివాసపురంలో ఉన్న ఓ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రేమ పేరుతో ఇదే ప్రాంతానికి చెందిన దాసరి సతీష్ అనే యువకుడు ముగ్గులో దింపాడు. ప్రతిరోజు స్కూలుకు వెళుతున్న తమ కుమార్తె వెనుక సతీష్ వెంట పడుతున్నాడని తల్లిదండ్రులు గ్రహించారు. కుమార్తెను మందలించి తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో ఉన్న అమ్మమ్మ ఇంటికి పంపించారు. అక్కడ కూడా ఇద్దరు మధ్యన ప్రేమాయణం కొనసాగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో కామ వాంఛ తీర్చుకున్నాడు. చివరకు గర్భవతిని చేశాడు.

Read Also: Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

మెడిసిన్స్ ద్వారా గర్భస్రావం కూడా చేయించాడు. యువతికి అధిక రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులకు తెలిసి కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు తల్లిదండ్రులు తమ కుమార్తెను మోసం చేసిన యువకుడు సతీష్‌ని పెళ్లి చేసుకోమని అడిగారు. దీంతో.. సతీష్ ముఖం చాటేసాడు. ఈ క్రమంలో బాధితురాలు తల్లిదండ్రులు కొవ్వూరు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులు ఫిర్యాదు పై పోలీసులు సతీష్ పై కేసు నమోదు చేసి బాలిక మైనర్ కావడంతో యువకుడిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు సతీష్ పరారీలో ఉన్నాడు. ఇతన్ని పట్టుకోడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Show comments