NTV Telugu Site icon

UP: రోజూ మద్యం తాగమని భర్తను బలవంతం పెట్టిన భార్య..విడాకులకు దారి తీసిన ఉదంతం

Up (2)

Up (2)

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో భార్య, భర్తల మధ్య వింత వివాదం చోటుచేసుకుంది. సాధారణంగా భర్త రోజూ మద్యం తాగుతుంటే ఇళ్లాలు మందలిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం సీన్ మారింది. భార్య రోజూ మద్యం తాగుతూ.. తనను కూడా తాగమని బలవంతం చేస్తున్నట్లు భర్త ఆరోపించాడు. ఈ పరిస్థితి విడాకుల దాకా చేరింది. ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో.. భార్యాభర్తల మధ్య గొడవకు కారణం తెలుసుకున్న కౌన్సెలర్లు షాక్ అయ్యారు. తన భార్య మద్యం తాగుతుందని మరియు తనను మద్యం తాగమని బలవంతం చేస్తుందని భర్త ఆరోపించారు. ఆమె ఒత్తిడికి విసిగిపోయిన భర్త తన భార్యను ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టాడు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

READ MORE: Raj Tarun: 10 ఏళ్ల క్రితమే పెళ్లి.. అబార్షన్లు.. మారు పేరుతో విదేశీ ట్రిప్పులు.. రాజ్ తరుణ్ కేసులో సంచలనాలు

అయితే.. విచారణ అనంతరం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవను పోలీసులు జిల్లాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రానికి తరలించారు. కౌన్సెలర్ ప్రకారం.. దంపతులు కౌన్సెలింగ్ చేస్తుండగా.. అక్కడే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. “నాకు రెండు నెలల క్రితమే వివాహమైంది. నేను ప్రతిరోజూ మద్యం తాగలేను. అయితే రోజూ మద్యం తాగమని భార్య బలవంతం చేస్తుంది. నా భార్య ఒకేసారి మూడు నుంచి నాలుగు పెగ్గులు తాగుతుంది.” అని భర్త ఆరోపించాడు. ఆ అర్ధాంగి భర్త ఆరోపణలన్నింటినీ అంగీకరించింది. భర్త చెప్పిన విషయాలన్నీ వస్తవమేనని ఒప్పుకుంది. తన భర్త తనను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టాడని సికంద్రాలో నివాసముంటున్న భార్య ఆరోపించింది. ప్రస్తుతం తన తల్లి ఇంట్లో ఉంటున్నట్లు పేర్కొంది. ఇరువురి వాదనలు విన్న కౌన్సెలర్ దంపతుల మధ్య రాజీ కుదుర్చే ప్రయత్నం చేశారు. వినక పోవడంతో మరో కొద్ది రోజులు గడువు ఇచ్చారు.