UP: రోజూ మద్యం తాగమని భర్తను బలవంతం పెట్టిన భార్య..విడాకులకు దారి తీసిన ఉదంతం
- ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో భార్య.. భర్తల మధ్య వింత వివాదం
- భార్య రోజూ మద్యం తాగుతూ.. తనను కూడా తాగమని బలవంతం చేస్తున్నట్లు భర్త ఆరోపణ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
- పెళ్లయిన రెండు నెలలకే దంపతుల మధ్య వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో భార్య, భర్తల మధ్య వింత వివాదం చోటుచేసుకుంది. సాధారణంగా భర్త రోజూ మద్యం తాగుతుంటే ఇళ్లాలు మందలిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం సీన్ మారింది. భార్య రోజూ మద్యం తాగుతూ.. తనను కూడా తాగమని బలవంతం చేస్తున్నట్లు భర్త ఆరోపించాడు. ఈ పరిస్థితి విడాకుల దాకా చేరింది. ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో.. భార్యాభర్తల మధ్య గొడవకు కారణం తెలుసుకున్న కౌన్సెలర్లు షాక్ అయ్యారు. తన భార్య మద్యం తాగుతుందని మరియు తనను మద్యం తాగమని బలవంతం చేస్తుందని భర్త ఆరోపించారు. ఆమె ఒత్తిడికి విసిగిపోయిన భర్త తన భార్యను ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టాడు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- Vaibhav Sooryavanshi: "ఫుడ్ విషయంలో తగ్గేదేలే".. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
- Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే 'హర్రర్ సినిమాలు' చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
అయితే.. విచారణ అనంతరం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవను పోలీసులు జిల్లాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రానికి తరలించారు. కౌన్సెలర్ ప్రకారం.. దంపతులు కౌన్సెలింగ్ చేస్తుండగా.. అక్కడే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. “నాకు రెండు నెలల క్రితమే వివాహమైంది. నేను ప్రతిరోజూ మద్యం తాగలేను. అయితే రోజూ మద్యం తాగమని భార్య బలవంతం చేస్తుంది. నా భార్య ఒకేసారి మూడు నుంచి నాలుగు పెగ్గులు తాగుతుంది.” అని భర్త ఆరోపించాడు. ఆ అర్ధాంగి భర్త ఆరోపణలన్నింటినీ అంగీకరించింది. భర్త చెప్పిన విషయాలన్నీ వస్తవమేనని ఒప్పుకుంది. తన భర్త తనను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టాడని సికంద్రాలో నివాసముంటున్న భార్య ఆరోపించింది. ప్రస్తుతం తన తల్లి ఇంట్లో ఉంటున్నట్లు పేర్కొంది. ఇరువురి వాదనలు విన్న కౌన్సెలర్ దంపతుల మధ్య రాజీ కుదుర్చే ప్రయత్నం చేశారు. వినక పోవడంతో మరో కొద్ది రోజులు గడువు ఇచ్చారు.
తాజావార్తలు
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
-
Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
-
Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్‌ఫ్లేట్ అవుతున్నాయి’!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!