Raj Tarun aborted My Pregancy Says Lavanya: రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. తనను పదేళ్ల క్రితమే రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాడని పదేళ్లుగా తనతో కాపురం చేస్తున్నాడని లావణ్య పేర్కొంది. రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని నార్సింగ్ పీఎస్ లో మరో ఫిర్యాదు చేసింది. నన్ను రెచ్చగొట్టి ఉద్దేశ పూర్వకంగా నా ఆడియోలు రికార్డ్ చేశాడని లావణ్య పేర్కొంది. మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసున్నాడని కూడా లావణ్య చెబుతోంది. 170 ఫోటోలు, టెక్నీకల్ ఎవిడెన్స్ ను నార్సింగ్ పోలీసులకు అప్పగించింది లావణ్య. ఈ క్రమంలో ఆధారాలు లేవని కేసు నమోదు చేయని పోలీసులు రాజ్ తరుణ్ పై ipc 493 తో పాటు మరి కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Poonam Kaur: వదల బొమ్మాళీ.. త్రివిక్రమ్ పై పూనమ్ ట్వీట్!!
మొత్తం రాజు తరుణ్ పైన మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. Ipc 420 సెక్షన్, 506, 493 సెక్షన్లపై కేస్ నమోదు చేసిన నార్సింగి పోలీసులు. తాను అన్విక పేరుతో రాజ్ తో కలిసి అనేక విదేశీ ట్రిప్పులకి కూడా తీసుకు వెళ్లాడని కూడా ఆమె చెబుతోంది. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలో రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చి విచారించనున్నారు నార్సింగ్ పోలీసులు. మరోపక్క లావణ్య పై సినీ నటి మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో తన సోదరుడికి లావణ్య అనుచిత సందేశాలను పంపుతోంది అంటూ లావణ్య పై మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేశారు. మరోవైపు తనపై తప్పుడు ప్రచారం చేస్తుందంటూ మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసింది. మల్హోత్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్నారు ఫిలింనగర్ పోలీసులు.