Telangana Elections: తెలంగాణ ఎన్నికల వేళ కొన్ని చోట్ల చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటికి సంబంధిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వ్యక్తి విచిత్రంగా ఆవు మీద కూర్చుని ఓటు వేసేందుకు వచ్చారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే తానూరు మండలం మహలింగి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం వేరే చోట నివాసం ఉంటున్నారు. కాగా నేడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తన సొంత గ్రామానికి ఆవుపై వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నానని తెలుపుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు.