NTV Telugu Site icon

Train Accident: పట్టాలు తప్పిన రైలు కోచ్‌లు.. తప్పిన పెను ప్రమాదం..

Train Accident

Train Accident

తమిళనాడులో మంగళవారం ఉదయం రైలు ప్రమాదం తప్పింది. పుదుచ్చేరికి వెళ్తున్న మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. విల్లుపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారి తెలిపారు. లోకో పైలట్ దానిని చూసి వెంటనే రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మూడు గంటల్లోనే రైలు రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. పట్టాలు తప్పడానికి గల కారణాలు విచారణ పూర్తయిన తర్వాతే తెలుస్తుందని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

READ MORE: Laurene Powell: మహా కుంభమేళాలో అస్వస్థతకు గురైన స్టీవ్ జాబ్స్ భార్య..

దాదాపు 500 మంది ప్రయాణికులతో విల్లుపురం-పుదుచ్చేరి రైలు ఉదయం 5.25 గంటలకు విల్లుపురం నుంచి బయలుదేరింది. రైలు మలుపు దాటుతుండగా దాని కోచ్‌లు పట్టాలు తప్పడంతో లోకో పైలట్ వెంటనే రైలును ఆపారు. ఈ ప్రమాదం కారణంగా విల్లుపురం మార్గంలో ఉదయం 8.30 గంటల వరకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విల్లుపురం-పుదుచ్చేరి మెము రైలు 38 కిలోమీటర్ల స్వల్ప దూరం ప్రయాణిస్తుంది.

READ MORE: Bandi Sanjay Kumar: పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్..

ఇదిలా ఉండగా… చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రైళ్ల వేగం మందగించడం గమనార్హం. మనం దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు అలముకొంది. దీని కారణంగా దృశ్యమానత మందగించింది. రైళ్ల నిర్వహణకు అంతరాయం కలిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 6 గంటల వరకు మొత్తం 39 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కొన్ని రైళ్లు 30 నిమిషాలు ఆలస్యంగా నడవగా, మరికొన్ని రైళ్లు నాలుగు గంటల వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Show comments