Madanapalle Crime: ఆస్తుల కోసం గొడవలు జరిగినప్పుడు.. నా ప్రాణం ఉన్నంతవరకు ఆస్తి ఇచ్చేది లేదనే వాదనలు చూస్తుంటాం.. అయితే, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గొడవ జరిగిన క్రమంలో.. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీకు ఆస్తి ఇచ్చేది లేదంటూ.. తన కుమారుడితో ఓ తండ్రి తెగేసి చెప్పాడట.. ఇది మనసులో పెట్టుకున్న ఆ కుమారుడు.. కన్నతండ్రినే దారుణంగా హత్య చేశాడు..
Read Also: Hardik Pandya Post: శ్రీలంక టూర్ వేళ.. ఆసక్తికరమైన పోస్టు పెట్టిన హార్దిక్ పాండ్యా!
ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆస్తి కోసం కన్న తండ్రినే కొడుకు హత్య చేసిన దారుణ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి లో జరిగింది. టు టౌన్ సీఐ యువరాజు కథనం మేరకు.. మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లి రాములగుడి విధికి చెందిన 65 ఏళ్ల నీరుగట్టు చెన్నారెడ్డిని బుధవారం రాత్రి వివర్స్ కాలని సమీపంలో కారుతో గుద్ది కన్న కొడుకే హత్య చేశాడు.. మృతుడు చెన్నారెడ్డి వడ్డీ వ్యాపారం చేసేవాడు.. అయితే, చెన్నారెడ్డికి రఘునాథ్ రెడ్డి, శంకర్ రెడ్డి అనే ఇద్దరు కుమారులు వున్నారు. ఈ క్రమంలో చెన్నారెడ్డి భార్య, కుమారులను ఆస్తి ఇవ్వకుండా ఇంటిలో నుంచి గెంటివేసినట్టుగా తెలుస్తోంది.. ఆస్తి పంపకాల కోసం పలుమార్లు తండ్రిని పెద్ద కుమారుడు రఘునాథ్ రెడ్డి నిలదీశాడట.. అయితే, నా ప్రాణం ఉన్నంతవరకు ఆస్తి ఇచ్చేది లేదని మృతుడు చెన్నారెడ్డి చెప్పినట్లు సమాచారం. ఆస్తి ఇవ్వలేదని రగిలిపోతున్న రఘునాథ్‌రెడ్డి.. కన్నతండ్రిని కారుతో గుద్ది హతమార్చాడు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటన స్థలంలో కారును స్వాధీనం చేసుకొన్న పోలీసులు.. టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.. అనంతరం నిందితుడిని అదుపులోకి విచారిస్తున్నారు.