Shruthi Hasan : జీవితాంతం దాని జోలికి పోనంటున్న శృతిహాసన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తన టాలెంట్ తో టాలీవుడ్ లో శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మధ్య లో తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరం అయినా కూడా టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ తో దూసుకుపోతుంది.ఈ ఏడాది ఈ భామ తెలుగులో వరుస సక్సెస్‌లను అందుకుంది.ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి వాల్తేర్ వీరయ్య మరియు బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను అందుకున్నది. ఇటీవల విడుదలైన నాని హాయ్ నాన్న సినిమాలో శృతిహాసన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. అలాగే డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ప్రభాస్ సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. సలార్ మూవీ లో శృతిహాసన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.ఇదిలా తాజాగా శృతి హాసన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..
ఇక నుండి జీవితాంతం తాను మద్యపానానికి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు శృతిహాసన్ చెప్పింది. డగ్స్ జోలికి తాను ఎప్పుడు వెళ్లలేదని ఆమె తెలిపింది. డ్రగ్స్, పార్టీ కల్చర్‌పై శృతిహాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.గతంలో తనకు తాగుడు అలవాటు ఉండేదని శృతిహాసన్ చెప్పింది. మందు తాగడంలో ఎలాంటి ఆనందం లేదనే విషయం అర్థమైందని, అప్పటి నుంచి ఆ ఆలవాటుకు దూరమయ్యానని ఆమె చెప్పింది. గత ఎనిమిదేళ్లుగా మద్యపానానికి దూరంగా ఉంటున్నట్లు కూడా శృతిహాసన్ తెలిపింది.”పార్టీలకు, మందుకు దూరమైనందుకు ఎలాంటి బాధ లేదు. ఇప్పుడు ఎలాంటి హ్యాంగోవర్స్ లేవు. జీవితం ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది” అని శృతిహాసన్ చెప్పింది. మళ్లీ జీవితంలో ఎప్పుడు మందు ముట్టకూడదని నిర్ణయించుకున్నట్లు శృతిహాసన్ చెప్పింది. తాగడం మానేసిన తర్వాత పార్టీలు మరియు ఫ్రెండ్స్‌ను అవైయిడ్ చేయడం ఎంతో కష్టంగా మారిందని ఆమె తెలిపింది. తాగడం అలవాటు ఉన్నా తానేప్పుడూ డ్రగ్స్ జోలికి మాత్రం పోలేదని శృతిహాసన్ తెలిపింది..ప్రస్తుతం శృతిహాసన్ కామెంట్స్ తెగ వైరల్ గా మారాయి.
Also Read
- Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
- Chips Packet Empty: చిప్స్ ప్యాకెట్ సగం ఖాళీగా ఎందుకు ఉంటుంది..? 99 శాతం మందికి తెలియని నిజం ఇదే..
- England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
- PM Modi: ఇన్స్టాగ్రామ్ వాడండి, యూత్‌కు దగ్గరకండి.. మంత్రులకు మోడీ క్లాస్..
తాజావార్తలు
-
Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
-
Chips Packet Empty: చిప్స్ ప్యాకెట్ సగం ఖాళీగా ఎందుకు ఉంటుంది..? 99 శాతం మందికి తెలియని నిజం ఇదే..
-
England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
-
PM Modi: ఇన్స్టాగ్రామ్ వాడండి, యూత్‌కు దగ్గరకండి.. మంత్రులకు మోడీ క్లాస్..
-
Bhatti Vikramarka : సింగరేణి బ్లాకులు ప్రైవేట్ పరమైతే తీవ్ర ప్రమాదం
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!