Actor Venu: హీరో వేణు పై కేసు నమోదు.. ఏమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకుల, మరో ప్రజా ప్రతినిధి, సినీ నటుడు తొట్టెంపూడి వేణుతో పాటు సంస్థ ఎండీపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ రాష్ట్రములో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ పనిని తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీహెచ్‌డీసీ) ద్వారా ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ప్రాజెక్ట్ ను దక్కించుకొంది.
Ghaziabad : ఇద్దరు భర్తలను విడిచిపెట్టి.. బావతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్.. కట్ చేస్తే
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇక ఈ పనిని బంజారాహిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ, స్వాతి కన్‌స్ట్రక్షన్స్ సంస్థలు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ నుండి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ ప్రొజెట్ సంబంధించి స్వాతి కన్‌స్ట్రక్షన్ మధ్యలోనే ఆ పని నుండి తప్పుకోగా రిత్విక్ ప్రాజెక్ట్స్ 2002లో పనులు మొదలు పెట్టింది. ఇక వారు చేసిన పనులకు రూ. 450 కోట్లను టీహెచ్‌డీసీ అందించింది. అందులో 5.5 % ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ తీసుకొని, మిగిలిన 94.5 శాతం రిత్విక్ కన్‌స్రక్షన్స్ ఖాతాలో వేశారు. ఆ తరువాత ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కి, తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Kavya Maran: ఏంటి కావ్య పాప లవ్లో పడిందా.. ఆ యంగ్ క్రికెటర్ తోనేనా..?
ఇప్పుడు మిగిలిన పనులకు గాను రూ.1,010 కోట్ల రూపాయలు విడుదల కాగా డబ్బు తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో జమ చేసింది. ఇందులో సైతం ఒప్పందం ప్రకారం వాటాలు తీసుకోవాల్సి ఉండగా ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్‌రావు, మరో ప్రతినిధి, సినీ నటుడు తొట్టంపూడి వేణు, కావూరి భాస్కర్‌రావు తల్లి, పీసీఎల్ సంస్థ డైరక్టర్ కె.హేమలత, సోదరి శ్రీవాణిలతో పాటు సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ప్రవీణ్ పాతూరి.. రిత్విక్ ప్రాజెక్ట్స్‌తో చేసుకున్న ఒప్పంద హక్కులను రద్దు చేశారు. దింతో వారు ఉద్దేశపూర్వకంగా మోసం చేసి మొత్తం డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులపై రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉపాధ్యక్షుడు టి.రవికృష్ణ గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దింతో మొత్తం 5 మందిపై సెక్షన్ 406, 420, 506 రెడ్ విత్ 34 కింద కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!