ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో వెలుగు చూసిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. మూడు ప్రయాణీకుల బోగీలు ఇప్పటికీ ఘటనా స్థలంలో శిథిలాలుగా పడి ఉన్నందున మృతుల సంఖ్య దాదాపు 300కు పైగా ఉంటుందని చెబుతున్నారు. గ్యాస్ కట్టర్లు, యంత్రాలతో రెస్య్కూ టీమ్స్ రైల్ బోగీల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read : Self Confidence : పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపాలి.. ఈ చిట్కాలను చూడండి
అయితే ఘటనపై భారతీయ సంతతికి చెందిన రచయిత అశోక్ స్వైన్ స్పందించారు. భారత ప్రధాని గంటకోసారి బట్టలు మార్చుకున్నంత మాత్రాన దేశం గొప్పగా మారదు.. మృతదేహాలను కప్పడానికి దేశం కూడా కొన్ని సరైన బట్టలు వెతకాలి అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
Also Read : Seeling Fans: అమెజాన్‌లో ఫ్యాన్లకు భారీ ఆఫర్.. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తెచ్చుకోండి ఆలస్యమెందుకు..!
అక్కడికక్కడే పరిస్థితి చాలా దారుణంగా ఉందని భారతీయ సంతతికి చెందిన రచయిత అశోక్ స్వైన్ అన్నారు. ప్రస్తుతం సమీపంలోని ఆసుపత్రుల్లో మృతదేహాలను ఉంచేందుకు స్థలం కూడా తగ్గిపోతుందని వెల్లడించారు. మృత దేహాలపై కప్పేందుకు కవచాలు లేవు.. రైలు నుంచి వెలికితీసిన బట్టలతో మృతదేహాలను కప్పి ఉంచుతున్నారు. ఈ దృశ్యాన్ని కళ్లారా చూస్తున్న వారెవరైనా ఒకేసారి ఇంతమంది చనిపోవడం ఎలా సాధ్యమని నమ్మలేకపోతున్నారు అని ఆయన అన్నారు.
Also Read : Chattisgarh: గర్ల్ ఫ్రెండ్ పై అనుమానం..51సార్లు అతి దారుణంగా పొడిచి చంపిన యువకుడు..
సహాయక సిబ్బంది రైలులో నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. వందలాది అంబులెన్స్‌లు అక్కడి నుంచి మృతదేహాలను తీసుకెళ్లే పనిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ మృత దేహాలను ఉంచేందుకు ఆసుపత్రుల్లో స్థలం తక్కువగా ఉందని భారతీయ సంతతికి చెందిన రచయిత అశోక్ స్వైన్ అన్నారు. గాయపడిన వారికి వీలైనంత త్వరగా చికిత్స అందించడమే ప్రథమ ప్రాధాన్యమైనప్పటికీ, ఆ మృతదేహాలను గుర్తించి వారి నిజమైన బంధువులకు అప్పగించడమే ఇప్పుడు అధికార యంత్రాంగం ముందున్న అతిపెద్ద సవాలు అంటూ పేర్కొన్నారు.
https://twitter.com/ashoswai/status/1664863188213456897