ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో పిస్టల్ కలకలం రేపింది. దుబాయ్ ప్రయాణీకుడి వద్ద పిస్టల్ గుర్తించిన కస్టమ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అతని చెక్ ఇన్ బ్యాగ్ లో పిస్టల్ తో పాటు రెండు మ్యాగజైన్ సీజ్ చేశారు కస్టమ్స్ బృందం. పిస్టల్ ను చూసి ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు కస్టమ్స్ అధికారులు.
చెక్ ఇన్ బ్యాగ్ లో పిస్టల్ ఎలా తీసుకొని వచ్చాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. పూర్తిగా దుబాయ్ లో సెక్యూరిటీ లోపంగా భావిస్తున్నారు కస్టమ్స్ అధికారులు. పిస్టల్ తో ఉన్న బ్యాగ్ ను విమానం లోపలికి ఎలా అనుమతించారని లోతుగా విచారణ చేస్తున్నారు అధికారులు.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో ఒక్కసారి అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది. పట్టుబడ్డ యువకుడు ముస్లిం గా గుర్తించారు. ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. దుబాయ్ నుండి ఢిల్లీ వచ్చిన విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు.