Tragedy : శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మంగరాజు రాజబాబు ఆమదాలవలస మండలం ఈసర్లపేట గ్రామం. అతనికి 2016లో ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. 2022 ఫిబ్రవరిలో అదే గ్రామానికి చెందిన మౌనిక ను ఇచ్చి పెద్దలు పెళ్లిచేశారు. రాజబాబు ప్రస్తుతం హరియాణా రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మౌనిక కూడా ఏడు నెలల గర్భిణి. ఆమె అనారోగ్యంతో బాధపడుతుండగా.. రాజబాబు తండ్రి వైజాగ్ ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించాడు. అనంతరం తన కొడుకుకు సమాచారం అందించాడు. వెంటనే రాజబాబు సెలవు పెట్టి హరియాణా నుంచి వచ్చాడు.. ఈ క్రమంలో ఈనెల 16న తన భార్య మౌనిక లోకాన్ని వదిలి వెళ్లిపోయింది.
Read Also: Viral : స్కర్ట్స్ వేసుకుని ‘అబ్బా’యిలు.. వింతగా చూసిన అమ్మాయిలు
భార్య మరణాన్ని రాజబాబు జీర్ణించుకోలేకపోయాడు. అప్పటి నుంచి భోజనం మానేశాడు. దీంతో అస్వస్థతకు గురయ్యాడు. బాగా కుంగిపోయాడు. ఈ క్రమంలో రాజబాబు ఈనెల 19న ఆరోగ్యం బాగాలేదని.. ఆస్పత్రికి వెళ్తానని ఇంట్లో చెప్పాడు. ఆముదాలవలస వెళ్లి అక్కడి నుంచి రైలెక్కి పొందూరు చేరుకున్నాడు. తాను పొందూరులో ఉన్నానని.. చనిపోతున్నానని స్నేహితులకు ఓ మెసేజ్ చేశాడు. దీంతో ఫ్రెండ్స్ అంతా షాకయ్యారు. వెంటనే పొందూరు పోలీసులకు సమాచారం అందించారు.. అందరూ కలిసి పొందూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. చివరికి కొంచాడ దగ్గర ఓ తోటలో రాజాబాబు ఉరివేసుకుని కనిపించాడు. నాలుగురోజుల వ్యవధిలోనే కొడుకు కోడలు ఇద్దరూ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read Also: Viral Video: పింఛన్ కోసం వృద్ధురాలి పాట్లు.. ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా ఒంటి కాలితో నడక..