ఢిల్లీలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తూర్పు ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్య, బావమరిదిని దారుణంగా హత్య చేశాడు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉండగా.. పోలీసులు అతని కోసం జల్లెడపట్టి అరెస్ట్ చేశారు. కాగా.. హత్య ఘటనపై పోలీసులు విచారించగా.. వారిని హత్య చేయడానికి స్క్రూడ్రైవర్‌ను ఉపయోగించినట్లు నిందితుడు తెలిపాడు. దీంతో.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Mamata Banerjee: శ్రీరామ నవమి రోజు బీజేపీ అల్లర్లకు కుట్ర చేస్తోంది..
పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా.. అక్కడ ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. ఆ ఇద్దరి మృతదేహాలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు ఉదయం 10 గంటలకు షకర్‌పూర్‌లో వారు నివసించే ఇంట్లో గొడవ జరిగిందని, ఆ గొడవలో ఎవరైనా గాయపడ్డారా అని షకర్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు పిసి-జెఎఆర్ నుండి కాల్ వచ్చిందన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా.. ఇంట్లో ఓ మహిళ, 18 ఏళ్ల యువకుడి మృతదేహాలు రక్తంలో తడిసి పడి ఉన్నాయి.
మృతులు అక్క కమలేష్ హోల్కర్, అతని సోదరుడు రామ్ ప్రతాప్ సింగ్ గా గుర్తించారు. హత్య చేసిన తర్వాత.. నిందితుడు శ్రేయాన్స్ పాల్, కుమారుడు రంబీర్ సింగ్ పారిపోయారు. తరువాత వారిని పోలీసులు పట్టుకున్నారు. కమలేష్ సోదరుడు రామ్ ప్రతాప్ తన మేనల్లుడి పుట్టినరోజు జరుపుకోవడానికి.. ఏప్రిల్ 14న తన సోదరి ఇంటికి వచ్చాడు. కాగా.. ఈ ఘటనపై మృతుల కుటుంబీకులకు పోలీసులు సమాచారం అందించారు. హత్యకు ముందు కమలేష్, ఆమె భర్త శ్రేయాన్స్ పాల్ మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాత హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు.