Family Dispute : ఢిల్లీ సమీపంలోని భల్స్వా డెయిరీ ప్రాంతంలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భార్య భోజనం వండడం లేదని, ఇంటి పనులు సమయానికి చేయలేదని అనారోగ్యంతో ఉన్న భార్యను భర్తే హతమార్చాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి భర్త పేరు భజరంగీ గుప్తా. భజరంగీ, ప్రీతి మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత ఇద్దరి మధ్య చీటికి మాటికి గొడవలు వచ్చేవి. ఆ సమయంలో ప్రీతిని భజరంగి ఎప్పుడూ కొట్టేవాడు. ప్రీతికి మూడు నెలల క్రితం పాప పుట్టింది. ప్రసవం కారణంగా ప్రీతి బలహీనంగా ఉంది. దీంతో ఆమె ఇంట్లో పనులు చేయలేకపోతుంది. దీనిని ఆమె భర్త తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇంటిపనులు చేయడం ఇష్టం లేదని ఆమె బద్ధకం నటిస్తుందని భర్త ఆరోపిస్తూ ఉండేవాడు. ఆదివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి ప్రీతి భర్తకు భోజనం సిద్ధం కాలేదు. దీంతో కోపోద్రిక్తుడైన భజరంగీ తన భార్య ప్రీతితో గొడవకు దిగాడు.
Read Also: Al-Qaida : ప్రతీకారం తీర్చుకుంటాం.. భారత్ పై దాడి చేస్తాం : ఆల్ ఖైదా
ఆ తర్వాత కోపోద్రిక్తుడైన భజరంగి తన భార్యను చెక్క కర్రతో కొట్టడం ప్రారంభించాడు. దాడిలో ప్రీతి తీవ్రంగా గాయపడి నేలపై పడిపోయింది. ఆ తర్వాత భజరంగీ ఇంటి నుంచి పారిపోయాడు. బంధువులు ప్రీతిని బురారీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రీతి తల్లి వాంగ్మూలాన్ని నమోదు చేసి కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు భజరంగీని వెతికి పట్టుకున్నారు.
Read Also:Sri Hanuman Stotra Parayanam: నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శారీరక, మానసిక రుగ్మతలు మాయం..