Site icon NTV Telugu

Tasty Food : ఫుడ్ బాగోలేదని కూతురు కళ్లెదుటే భార్యను చంపిన భర్త

murder

murder

Tasty Food : మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూతురి కళ్లెదుటే భర్త భార్య హతమార్చాడు. మద్యం మత్తులో భార్యను చంపి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడి భర్త పేరు రామ్ సజీవన్ కోల్. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది.

Read Also: Dandruff Remedies: ఈ ఇంటి చిట్కాలతో.. చుండ్రుకు చెప్పండి గుడ్‌బై

రామ్ సజీవన్ తన భార్య, కుమార్తెతో కలిసి సిధి జిల్లా కేంద్రానికి 15 కి.మీ దూరంలోని డియోగర్ గ్రామంలో నివసించాడు. రామ్ సజీవన్ మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం మత్తులో భార్యతో గొడవ పడేవాడు. ఏదో ఒక కారణంతో భార్యను కొట్టేవాడు. బంధువులు తరచూ రామ్‌ సజీవన్‌కు వారించేవారు. కానీ అతను ఎవరి మాట వినలేదు. ఆదివారం రాత్రి కూడా ఎప్పటిలాగే మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆహారం విషయంలో మద్యం మత్తులో భార్యతో గొడవకు దిగాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి రామ్ సజీవన్ తన భార్య నవమిపై దారుణంగా దాడి చేశాడు. ఈ దాడిలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు భర్తపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Read Also: RCB vs CSK: పోరాడి ఓడిన ఆర్సీబీ.. చివర్లో మలుపు తిప్పిన సీఎస్కే బౌలర్స్

Exit mobile version