కలబంద ఆకు నుంచి జెల్‌ను తీసి, దాన్ని నూనెలో కలిపి.. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్‌కు పట్టించాలి. కాసేపయ్యాక తేలికపాటి షాంపూతో కడిగేయాలి.

కొన్ని చుక్కల కొబ్బరి నూనెను తీసుకుని, ట్రీ ఆయిల్‌తో మిక్స్ చేసి.. చుండ్రు ఉన్న ప్రాంతాల్లో మసాజ్ చేయాలి.

వేపనూనె, ఆలివ్‌ ఆయిల్‌ని కలిపి.. గోరువెచ్చగా వేడి చేసి తలకు బాగా పట్టించాలి. 30 నిమిషాలయ్యాక తలస్నానం చేయాలి.

అల్లం ముక్కని చిన్నగా కట్ చేసి, నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారాక కుదుళ్లకు నూనె పెట్టి మర్దన చేయాలి. అనంతరం స్నానం చేయాలి.

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను, అరటి పండు గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, అరగంట తర్వాత స్నానం చేస్తే, చుండ్రు తగ్గుతుంది.

నారింజ పండు తొక్కను పేస్ట్‌లా చేసి, తలకు పట్టించి, మర్దన చేయాలి. గంటసేపయ్యాక గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

ఒక కప్పు నీటిలో కొద్దిగా ఉప్పు కలిపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి.. 10 నిమిషాల పాటు ఉంచి, తలస్నానం చేయాలి.

బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దన చేసి, టర్కీ టవల్ చుట్టుకోవాలి. 15 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి.